పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?

jagadeesh prathap bandari in Pushpa | పుష్ప సినిమా చూసిన ఎవరికైనా ఇప్పుడు ఒక్కటే అనుమానం వస్తుంది. అల్లు అర్జున్ పక్కనే సినిమా అంతా ఓ నటుడు ఇప్పుడు అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నాడు. ఎక్కడ్నుంచి వచ్చాడు.. ఎవరబ్బా ఇతగాడు అంటూ అంతా సెర్చ్ చేస్తున్నారు. ఆయన పేరు జగదీశ్ ప్రతాప్ భండారి. సుకుమార్ కంట్లో పడటంతో ఇప్పుడు ఈయన జాతకమే మారిపోయింది. సినిమాలో అల్లు అర్జున్ తర్వాత అంత పెద్ద క్యారెక్టర్ చేసింది ఈయనే. బన్నీ కనిపించిన ప్రతిసారి జగదీశ్ కూడా కనిపిస్తాడు.. ఒక్క పాటలు వచ్చినప్పుడు తప్ప.

రంగస్థలంలో రామ్చరణ్ పక్కన మహేశ్ మాదిరే ఇప్పుడు బన్నీతో జగదీష్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయనకు అసిస్టెంట్ పాత్ర ఇది. రాయలసీమ యాసలో మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు ఈయన. దాంతో ఇప్పుడు ఈ నటుడి గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇంతకుముందు ఏ సినిమాలో కూడా పెద్దగా కనిపించలేదు జగదీశ్. ఉన్నట్లుండి ఒకేసారి అంత పెద్ద క్యారెక్టర్ చేసేసరికి అంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. అత్యంత కీలకమైన పాత్రలో అద్భుతంగా నటించాడు ఈయన. పుష్పలో ఈ పాత్ర రావడానికి ముందు ఆయన కొన్ని సినిమాలు చేశాడు కానీ పెద్దగా రిజిష్టర్ కాలేదు.
పలాస 1978లో ఓ కీలక పాత్రలో నటించాడు జగదీశ్. అందులో కూడా ఈయన పాత్రకు మంచి పేరు వచ్చింది. దానికి ముందు ప్రియదర్శి మల్లేశం సినిమాలోనూ నటించాడు ఈయన. అయితే ఇవన్నీ చిన్న సినిమాలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆహాలో వచ్చిన కొత్త పోరడు వెబ్ సిరీస్ లోనూ నటించాడు జగదీశ్. అవన్నీ కాదు కానీ ఇప్పుడు పుష్ప సినిమాతో మనోడు ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అల్లు అర్జున్ తర్వాత ఈయన పాత్ర గురించే అంతా బాగా చర్చించుకుంటున్నారు. మరి పుష్పతో వచ్చిన క్రేజ్ ఈ నటుడు ఎంతవరకు వాడుకుంటాడో చూడాలిక.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మిగిలిన రాష్ట్రాల్లో పుష్ప కలెక్షన్స్ ఎలా ఉన్నాయి.. బన్నీ హిట్ కొట్టాడా..?
తెలుగు రాష్ట్రాల్లో హైయ్యస్ట్ ఫస్ట్ డే షేర్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..
అల్లు అర్జున్ Pushpa.. మూవీ రివ్యూ
నైజాంలో సరికొత్త చరిత్ర సృష్టించిన పుష్ప.. ఏం రికార్డులు సామీ..!
Pushpa | పుష్ప విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి కోరుకున్నది ఇదే..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
Pushpa Not Released | అక్కడ రిలీజ్ కాని ‘పుష్ప ‘..కారణమిదే !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

