Pushpa Not Release
టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ పుష్ప (Pushpa) థియేటర్లలో తన హవాకొనసాగిస్తోంది. సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ‘పుష్ప..ది రైజ్’ (Pushpa: The Rise) విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి టాక్‌తో ప్రదర్శించబడుతుంది. అయితే పుష్ప కోసం ఎదురుచూస్తున్న ఒక్క ప్రాంతవాసులు మాత్రం కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా..? అల్లు అర్జున్ (Allu Arjun)కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కేరళలోనే.
కొన్నిసాంకేతిక కారణాల వల్ల పుష్ప ఫైనల్ ఫ్రింట్ రావడంలో ఆలస్యమైంది. దీంతో మేకర్స్ సమస్యను పరిష్కరించి త్వరలోనే పుష్ప మలయాళ వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలను కుంటున్నాడట. తాజా సమాచారం ప్రకారం రేపు కేరళలో సందడి చేయనుందట పుష్ప. అప్పటివరకు కేరళలోని థియేటర్లలో పుష్ప తమిళ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. మొత్తానికి ఒక్కరోజు లేటైనా ఎంటర్ టైన్ చేయడం పక్కా అంటున్నాడు పుష్పరాజ్.
ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోరష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. మంగళం శ్రీను పాత్రలో సునీల్ నటించగా..అనసూయ దక్ష పాత్రలో నటించింది. ఫహద్ ఫాసిల్ కీ రోల్ పోషించాడు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ పుష్పకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’