తెలుగు ప్రేక్షకులు (Telugu Cinema)థియేటర్లలో పుష్పరాజ్ (Pushpa) సందడిని ఎంజాయ్ చేస్తున్నారు. సుకుమార్ (Sukumar) పుష్ప ఫస్ట్ పార్టు ‘పుష్ప..ది రైజ్'(Pushpa: The Rise) తెరకెక్కించిన తీరుకు అందరూ నీరాజనాలు పలుకుతున్నారు. పుష్ప ప్రొడక్షన్స్ వర్క్‌తో ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రాలేకపోయిన సుకుమార్ ప్రెస్ మీట్‌తో అందరినీ పలుకరించాడు. సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ..బన్నీని ఆకాశానికెత్తేశాడు.
‘ఇది అల్లు అర్జున్ సినిమా..పుష్ప చూసిన తర్వాత అల్లు అర్జున్ యాక్టింగ్‌కు స్టన్ అయిపోతారు. ప్రతీ ఒక్కరు అల్లు అర్జున్ పర్ ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిర్మాతలు చాలా ఓపికగా నన్ను భరించినందుకు ధన్యవాదాలు. నా కుటుంబంలాంటి నిర్మాతలైన నవీన్, రవికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా విడుదలయ్యే వరకు వాళ్లు ఎందుకని నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. సినిమాకు అద్బుతమైన సంగీతంతో బ్యాక్ బోన్‌గా నిలిచిన తన డార్లింగ్ దేవీ శ్రీప్రసాద్కు థ్యాంక్స్ చెప్పాడు సుకుమార్. శ్రీవల్లి పాత్రలో రష్మిక అద్బుతంగా నటించింది. ఫహద్ ఫాసిల్ తో పనిచేయడం చాలా ఇంప్రెసింగ్‌గా అనిపించిందని’ చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’