ఫ్యామిలీ లైఫ్‌ను ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ సాగించడం కొంచెం కష్టమైన పనే. అయితే సమయం దొరికిప్పునడల్లా కుటుంబంతో తమ అనుబంధాన్ని ఆస్వాదిస్తూ..మరోవైపు ఇండస్ట్రీలో లీడింగ్‌లో కొనసాగుతున్న హీరోయిన్లు కొంత మందే ఉన్నారు. ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) . సినిమాలు, బిజినెస్, ఫ్యామిలీ..ఇలా మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తుంది
సోషల్‌మీడియాలో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లిన స్టిల్స్ ను షేర్ చేస్తుంటుంది రకుల్. ఈ బ్యూటీ ప్రతీసారి గ్రాండ్‌గా క్రిస్మస్ (Christmas) వేడుకల్లో పాల్గొంటుంది. త్వరలో రాబోతున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు కూడా ప్లాన్ చేసింది రకుల్. ఈ సారి తన సోదరుడు అమన్‌తో కలిసి క్రిస్మస సంబురాలు జరుపుకోనుంది. క్రిస్మస్ వెకేషన్ కోసం రకుల్, అమన్ లండన్ టూర్ కు ప్లాన్ రెడీ చేసుకున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
అమన్, రకుల్ హైదరాబాద్, వైజాగ్ లో F45 gyms నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అమన్‌తో కలిసి ‘Starting You’ appను కూడా లాంఛ్ చేసింది రకుల్. టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు గుర్తించి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ఈ యాప్‌ను సుమారు 10వేల మందికిపైగా డౌన్ లోడ్ చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో