Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?

అల్లు అర్జున్- రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. నేడు భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మూవీ నుండి విడుదలైన ప్రతి సాంగ్ శ్రోతలని ఎంతగానో అలరించింది. సమంత నర్తించిన స్పెషల్ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.
సమంత సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతకన్నా ఎక్కువ విమర్శలు కూడా మూటగట్టుకుంది. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అంటూ సాగిన ఈ సాంగ్ లిరిక్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మగవాళ్లపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఈ పాట ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. పుష్ప టీంతో పాటు పాటలో నర్తించిన సమంతపై కూడా పురుషుల సంఘం కేసుపెట్టింది. ఈ పాటకు తమిళంలోనూ వ్యతిరేకత వస్తోంది.
తమిళనాడు పురుషుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పాటను తొగించకుంటే పాటకు డ్యాన్స్ చేసిన సమంత, పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, గేయ రచయిత వివేకాపై కేసు పెడతామని హెచ్చరించింది. అయితే పాటకు సంబంధించిన కాంట్రవర్సరీపై అల్లు అర్జున్ స్పందించారు. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్ బన్నీని ప్రశ్నించగా… ‘లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం’ అంటూ సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.
"ஊ சொல்றியா மாமே!" பாடலில் வருவது உண்மை தானே…! அல்லு அர்ஜூன் பதில்..#AlluArjun #Pushpa pic.twitter.com/1TLqtscOe7
— Shruti TV (@shrutitv) December 14, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

