Pushpa | పుష్ప విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి కోరుకున్నది ఇదే..

Allu arjun in Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇప్పటి వరకు కేవలం తెలుగు, మలయాళంలో మాత్రమే మంచి గుర్తింపు ఉండేది. కానీ పుష్ప సినిమా తర్వాత ఆయనకు ఇండియా వ్యాప్తంగా అభిమానులు వచ్చారు. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యద్భుతంగా ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా పుష్ప నిలిచింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో కూడా పుష్ప సినిమాకు నీరాజనాలు పడుతున్నారు ప్రేక్షకులు. భాషా భేదం లేకుండా అల్లు అర్జున్ నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు.
పుష్ప రాజ్ పాత్రను ఆయన పోషించిన తీరు చూసి సలాం కొడుతున్నారు. ఈ సినిమా విషయంలో ముందు నుంచి అల్లు అర్జున్ ఏదైతే చెబుతూ వస్తున్నాడో అది ఇప్పుడు నిజమైంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు అబ్బా ఏం చేశాడ్రా బన్నీ.. చంపేశాడు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. హిందీలో కూడా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది అక్కడ కూడా అల్లు అర్జున్ నటనకు ఉత్తరాది ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. కేరళలో ఇప్పటికే బన్నీకి అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమాతో అది మరింత పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రియలిస్టిక్ క్యారెక్టర్ లో సుకుమార్ ఊహలకు మంచి ప్రాణం పోశాడు బన్నీ. పుష్ప సినిమా కేవలం అల్లు అర్జున్ కోసం చూడొచ్చు అంటూ బయట ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ముందునుంచి ఈ సినిమా మీద బన్నీ పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ రూపంలో కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అల్లు అర్జున్ Pushpa.. మూవీ రివ్యూ
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
Pushpa Not Released | అక్కడ రిలీజ్ కాని ‘పుష్ప ‘..కారణమిదే !
Pushpa: బెనిఫిట్ షో వేయలేదని థియేటర్పై దాడి చేసిన బన్నీ అభిమానులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

