Pushpa: బెనిఫిట్ షో వేయలేదని థియేటర్‌పై దాడి చేసిన బన్నీ అభిమానులు

పుష్పరాజ్ ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తున్నాడు. తెలంగాణలో పుష్ప సినిమాకు 5 షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినీ ప్రేక్షకులకు కట్టి పడేసింది. సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది. ఈ మాస్ బీట్‌కు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు అందరు తెగ హడావిడి చేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా హిందూపురంలో బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు.
థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పలువురు అభిమానులు థియేటర్‌పై రాళ్లు రువ్వారు.ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు. థియేటర్ గేట్లు మూసివేశారు. కాగా ఏపీలో బెనిఫిట్ షో లు వేయవద్దని ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 35ను జారీ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

