Pushpa movie collections | పెద్దగా ప్రమోషన్ లేకుండానే పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. విడుదలకు ఒకటి రెండు రోజుల ముందు చేసిన ప్రమోషన్ తప్ప పుష్ప సినిమాకు పెద్దగా హడావుడి చేయలేదు. అందుకే తెలుగులో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయని దర్శక నిర్మాతలు కూడా పెద్దగా ఊహించలేదు.. అంచనాలు పెట్టుకోలేదు. నమ్మకాలు అసలే పెట్టుకోలేదు. అయినపన్పటికీ మిగిలిన రాష్ట్రాలలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది పుష్ప. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.25 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలిపి మరొక రూ.13 కోట్లు వసూలు చేసింది.
అందులో కర్ణాటకలో రూ.3.75 కోట్ల షేర్ ఉంది. సాధారణంగానే మెగా హీరోలకు కర్ణాటకలో మంచి ఇమేజ్ ఉంది. ఇక పూర్తిగా ఇప్పుడు ఏకంగా కన్నడ వెర్షన్ విడుదలైంది. దాంతో మంచి వసూళ్లు వచ్చాయి. తమిళనాట కూడా ఈ సినిమాకు చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజు అక్కడ పుష్ప సినిమా 3.65 కోట్ల గ్రాస్.. దాదాపు 2 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి, సాహో తర్వాత ఆ స్థాయి ఓపెనింగ్స్ తీసుకొచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా ఇదే కావడం గమనార్హం. సినిమాలో తమిళ యాస కూడా కాస్త ఉండడం కలిసొస్తుంది.
ఇక కేరళలో అల్లు అర్జున్ కు ముందు నుంచి కూడా మంచి ఫాలోయింగ్ వుంది. అదే పుష్ప వసూళ్ళలో కూడా కనిబడింది. తొలిరోజు అక్కడ దాదాపు రూ.2 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. మరోవైపు హిందీలో 4 కోట్ల గ్రాస్.. 2 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. మొత్తానికి మొదటి రోజు పుష్ప తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆకట్టుకుంది. మరి ఇదే జోరు అక్కడ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తెలుగు రాష్ట్రాల్లో హైయ్యస్ట్ ఫస్ట్ డే షేర్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..
అల్లు అర్జున్ Pushpa.. మూవీ రివ్యూ
నైజాంలో సరికొత్త చరిత్ర సృష్టించిన పుష్ప.. ఏం రికార్డులు సామీ..!
Pushpa | పుష్ప విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి కోరుకున్నది ఇదే..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
Pushpa Not Released | అక్కడ రిలీజ్ కాని ‘పుష్ప ‘..కారణమిదే !