సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా రూపొందుతున్న రూరల్ లవ్ డ్రామా ‘గోదారి గట్టుపైన’. సుభాష్‌చంద్ర దర్శకుడు. అభినవ్‌రావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి మూడోపాటను మేకర్స్ ఈనెల 13న విడుదల చేయనున్నారు. ‘బంగారు బొమ్మ..’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్‌ల కెమిస్ట్రీ యువతను ఆకట్టుకునేలా ఉంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోమిత్ కృష్ణ వర్మ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయిసంతోష్, సంగీతం: నాగవంశీకృష్ణ, నిర్మాణం: రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్.