Advocate Murder | కళ్లలో కారం చల్లి.. వేటకొడవళ్లతో నరికి.. నాగర్‌కర్నూల్‌లో న్యాయవాది దారుణ హత్య
Advocate Murder | నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ న్యాయవాది అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, న్యాయవాది మల్లయ్య (55)పై దుండగులు పథకం ప్రకారం దాడి చేసి వేటకొడవళ్లతో నరికి చంపారు.
Advocate Murder | నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ న్యాయవాది అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, న్యాయవాది మల్లయ్య (55)పై దుండగులు పథకం ప్రకారం దాడి చేసి వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లయ్య పెంట్లవెల్లిలో క్లినిక్ నిర్వహిస్తూ ఆర్ఎంపీ వైద్యుడిగా, న్యాయవాదిగా జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆయన క్లినిక్‌లో ఉండగా ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఆరోగ్య సమస్య ఉందని చెప్పి అక్కడికి వచ్చారు. వారిని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా మల్లయ్య కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారు.
అనంతరం ఆయనను క్లినిక్ నుంచి బయటకు ప్రధాన రహదారిపైకి లాక్కెళ్లి వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. తీవ్ర గాయాలతో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్లయ్య హత్య వెనుక భూ వివాదాలే ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

