Bigg boss 5 Grand Finale | బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగింపుకు ముహూర్తం స్టార్ట్ అయింది. గ్రాండ్ ఫినాలే ప్రారంభం అయింది. గ్రాండ్ ఫినాలేకు.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో పాటు.. ఐదుగురు ఫైనలిస్టుల కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే.. గ్రాండ్ ఫినాలేను బిగ్ బాస్ బాగానే ప్లాన్ చేశాడు.
గ్రాండ్ ఫినాలేలోనే ఆర్ఆర్ఆర్ టీమ్‌తో పాటు పుష్ప, శ్యామ్ సింగరాయ్ టీమ్ కూడా పాల్గొని బిగ్ బాస్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే ప్రారంభమైన గ్రాండ్ ఫినాలేలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు డ్యాన్స్‌లతో అదరగొట్టేశాడు. ఫైనలిస్టుల తల్లిదండ్రులు కూడా ఎవరికి వారే.. తమ పిల్లలే విజేత అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
మాజీ కంటెస్టెంట్లతో పాటు.. ఫైనలిస్టుల తల్లిదండ్రులతో నాగార్జున కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత హౌస్‌లోకి కెమెరాను తిప్పాడు హోస్ట్ నాగార్జున. ఐదుగురు ఫైనలిస్టులు బిగ్ బాస్ అభిమానుల కోసం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు.
మరికొద్దిసేపట్లో ఐదుగురిలో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ.. చివరగా మిగిలిన ఫైనలిస్టును బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్‌గా అనౌన్స్ చేస్తారు. చూద్దాం మరి.. ఎవరు బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ అవుతారో?