Manchu Lakshmi | కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చేతివేళ్లకు , మోకాలికి గాయాలై.. రక్తం కారుతున్న ఫొటోలను తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫొటోలు చూసిన తర్వాత ఫ్యాన్స్ మాత్రం కాస్త సీరియస్ అవుతున్నారు. అదేంటి గాయాలైతే.. విమర్శలు ఎందుకొస్తున్నాయని ఆలోచిస్తున్నారా.. అసలేం జరిగిందంటే..
చేతివేళ్లు, మోకాలికి దెబ్బలు తగిలి రక్తం కారుతున్న ఫొటోలను మంచు లక్ష్మీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసి అభిమానులు కంగారుపడిపోయారు. అసలు మంచు లక్ష్మీకి ఏమైంది? ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తుండటంతో స్పందించిన మంచు లక్ష్మీ అసలు విషయాన్ని తాపీగా బయటపెట్టింది. అవి రియల్ గాయాలు కావు.. రీల్ గాయాలని చెప్పింది. అది ఓ మలయాళ సినిమా కోసం వేసుకున్న మేకప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అవి కేవలం సినిమా స్టిల్స్ మాత్రమేనని చెప్పింది. నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.. నాపై ఇంత ప్రేమ, అభిమానం చూపిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు అని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పోస్టు చేసింది. అసలు విషయం తెలియడంతో పలువురు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో జోక్స్ ఏంటని విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం మంచు లక్ష్మీ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా వస్తున్న సినిమాలోనూ ఆమె నటిస్తోంది. ఈ సినిమాలో ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం తీసిన ఫొటోలనే ఆమె సోషల్‌మీడియాలో పోస్టు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg boss 5 Grand Finale | 105 రోజులు.. ఐదుగురు ఫైనలిస్టులు.. టైటిల్ విన్నర్ ఎవరు?
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
ఎక్కడో బహ్రెయిన్‌లో పుట్టిన మమతా మోహన్‌దాస్.. సౌత్‌లో హీరోయిన్ ఎలా అయ్యింది?
parampara in OTT | హాట్‌స్టార్ ఓటీటీలో పరంపర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?