BBTeBigboss Telugu Grand Finale | బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే టాప్ 5 కంటెస్టెంట్లలో ఇద్దరు వెళ్లిపోయారు. సిరి, మానస్ ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఇప్పుడు హౌస్‌లో టాప్ 3 కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్.. ముగ్గురే ఉన్నారు. వీళ్లలో ఒకరిని మాత్రమే బిగ్ బాస్ 5 టైటిల్ వరించనుంది.
ఇప్పటికే బ్రహ్మాస్త్ర, పుష్ఫ, శ్యామ్‌సింగరాయ్ టీమ్స్ బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు.. బిగ్ బాస్ అభిమానులను కూడా అలరించారు.
తాజాగా చిన్న బంగార్రాజు నాగ చైతన్య.. బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చాడు. బిగ్ బాస్ స్టేజ్ మీద నాగ చైతన్య కాసేపు అలరించాడు. అయితే.. చైతూ నాగ్‌కు ఒక స్పెషల్ గిఫ్ట్ అందించాడు. 105 రోజుల నాగార్జున బిగ్ బాస్ జర్నీకి సంబంధించిన ఏవీని ప్రేక్షకుల కోసం ప్లే చేయించాడు చైతూ. నాగార్జున ఏవీని చూసి బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ ఫుల్ ఖుషీ అయ్యారు.