బిగ్‌బాస్ షో.. ఈ సీజన్లో అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే..

Bigg boss 5 Telugu | ఏమో ఇప్పుడు జరుగుతున్న సీన్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. తాజాగా బిగ్‌బాస్ ఐదో సీజన్లో కూడా ఇదే జరిగింది. టాప్ 5 లో ఉన్న ఒకే ఒక అమ్మాయి సిరి ఎలిమినేట్ అయిపోయింది. టాప్ 5 కంటెస్టెంట్స్ నుంచి అందరి కంటే ముందు ఆమె బయటకు వచ్చేసింది. దాంతో వరుసగా ఐదో సారి కూడా అబ్బాయిలకు టైటిల్ వెళ్లిపోతుంది. మొదటి 4 సీజన్స్ కూడా అబ్బాయిలు టైటిల్ గెలిచారు. కనీసం ఐదో సీజన్ అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే ఈ సారి కూడా సారీ తప్ప ఇంకేమీ మిగల్లేదు. పైగా సీజన్ మొదలైనప్పటి నుంచి వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అవ్వడం మొదలైపోయింది.
ఐదో వారం గాని అబ్బాయి ఎలిమినేట్ కాలేదు. ఆ తర్వాత కూడా ఎక్కువగా అమ్మాయిలే బయటికి వచ్చారు. చివరికి టాప్-5లో కేవలం ఒకే ఒక అమ్మాయి మిగిలింది. సిరి చివరి ఐదుగురులో ఒకరిగా నిలిచిన కూడా టైటిల్ గెలుస్తుంది అనే నమ్మకం మాత్రం ఎవరిలోనూ లేదు. ఆమెకు కూడా గెలుస్తానన్న నమ్మకం ఏ కోశానా లేదు. అనుకున్నట్టుగానే ఆమె కూడా బయటికి వచ్చేసింది. బిగ్‌బాస్ తెలుగు ఐదు సీజన్లు కూడా అబ్బాయిలే టైటిల్ గెలవడంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయిప్పుడు. అసలు ఈ ఇంట్లో అమ్మాయిలకు గెలిచే అర్హత ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు కూడా. ఐదు సీజన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా అమ్మాయికి టైటిల్ రాలేదు.
తొలి సీజన్ శివబాలాజీ.. రెండో సీజన్ కౌశల్.. మూడో సీజన్ రాహుల్ సిప్లిగంజ్.. నాలుగో సీజన్ అభిజిత్ టైటిల్ తీసుకున్నారు. ఐదోసారి సన్నీ టైటిల్ గెలవబోతున్నాడు. ఈ ఐదు సార్లు కూడా అబ్బాయిలకే టైటిల్స్ వచ్చేశాయి. దానికితోడు ఈ ఐదుగురు కూడా తమదైన శైలిలో గేమ్ ఆడారు. ముఖ్యంగా శివబాలాజీ కూల్‌గా ఉంటూనే అవసరం అనుకున్నపుడు కోపంగా ఉండేవాడు.. కానీ కౌశల్ మాత్రం సంచలనం.. రాహుల్ సిప్లిగంజ్ కూడా అంతే. నాలుగో సీజన్ అభిజిత్ చాలా కూల్ అండ్ కామ్‌గా ఉంటూ తెలివిగా గేమ్ ఆడి టైటిల్ గెలిచాడు.
ఇప్పుడు సన్నీ కూడా అగ్రేషన్, ఎమోషన్ రెండు కలిపి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. బిగ్ బాస్ షోలో అమ్మాయిలు ఉన్నా కూడా కేవలం గ్లామర్ కోసమే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం కూడా లేకపోలేదేమో..? ఇంట్లో వాళ్లంతా అందాలను ఆరబోస్తూ కెమెరాలకు ఫోజులివ్వడమే సరిపోయింది. ముఖ్యంగా ఈ సీజన్లో కూడా చాలా మంది అమ్మాయిలు గ్లామర్ షో చేశారు. మొత్తానికి అబ్బాయిలు వరసగా టైటిల్స్ గెలుస్తుంటే.. బిగ్ బాస్ లో ఇదో సెంటిమెంట్ అయిపోయింది. మరి వచ్చే సీజన్ అయినా దీనికి ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాలిక.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బిగ్‌బాస్ విన్నర్ ఎవరు? హౌజ్‌మేట్స్ అనుకున్నది ఒకరిని.. అక్కడ జరుగుతున్నది మరొకటి..
Who is biggboss 5 Telugu winner | 105 రోజులు.. ఐదుగురు ఫైనలిస్టులు.. టైటిల్ విన్నర్ ఎవరు?
BB Telugu Grand Finale | అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మొదలైన బిగ్ బాస్ 5 ఫినాలే..
బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి.. తన పేరు ముందున్న ‘ఎస్ఎస్’ అసలు రహస్యం చెప్పేసిన జక్కన్న
మంచు లక్ష్మీ చేతికి, కాళ్లకు గాయాలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

