బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి.. తన పేరు ముందున్న ‘ఎస్ఎస్’ అసలు రహస్యం చెప్పేసిన జక్కన్న
బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి | మీ పేరులో ముందు ఉన్న ఎస్ఎస్ అంటే అర్థం ఏంటండి. మా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఫైనలిస్టుల పేర్లన్నీ ఎస్‌తోనే స్టార్ట్ అవుతాయి అని చెబుతాడు.
Bigg boss 5 Grand Finale | బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రాజమౌళి స్టేజ్ మీదికి రాగానే.. హోస్ట్ నాగార్జున, ముందు ఒకటే ప్రశ్న అడిగాడు. రాజమౌళి గారు.. మీ పేరులో ముందు ఉన్న ఎస్ఎస్ అంటే అర్థం ఏంటండి. మా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఫైనలిస్టుల పేర్లన్నీ ఎస్‌తోనే స్టార్ట్ అవుతాయి అని చెబుతాడు. దీంతో ఎస్ఎస్ అసలు సీక్రెట్ చెబుతాడు జక్కన్న.

నిజానికి.. ఎస్ఎస్ అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి అంతే కానీ.. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మాత్రం సక్సెస్, స్టుపిడ్ అంటాడు రాజమౌళి. దీంతో సక్సెస్ ఓకే కానీ.. స్టుపిడ్ అనే విషయం మాత్రం నేను ఒప్పుకోను అంటాడు నాగార్జున.
సినిమాలో విషయంలో సక్సెస్ ఓకే కానీ.. సినిమాలు తప్పించి మిగితా ఏ రంగంలోనూ నాకు అవగాహన లేదు. అందుకే నేను అక్కడ జీరో. అందుకే స్టుపిడ్ అంటాడు రాజమౌళి. మీకు నచ్చిన రంగంలో నాలెడ్జ్ ఉంటే చాలు కదండి అంటాడు నాగార్జున.
రాజమౌళి.. పాన్ ఇండియా ఫిలిం బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదికి వస్తాడు. ఈ సినిమా మొదటి పార్ట్ 2022, సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నాగార్జున, అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు అయాన్ డైరెక్టర్. రాజమౌళి ఈ సినిమాను సమర్పిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

