Naveen Polishetty | రాధే శ్యామ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత తీసుకున్నాడో తెలుసా..?

Naveen Polishetty | తెలుగు ఇండస్ట్రీలో ఫీమేల్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు కానీ మేల్ యాంకర్స్ మాత్రం తక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసేంత స్థాయిలో ఏ యాంకర్స్ కూడా లేరు. ప్రదీప్ మాచిరాజు, రవి లాంటి వాళ్లు ఈవెంట్స్ చేస్తారేమో కానీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. అందులోనూ పాన్ ఇండియన్ స్థాయి ఫంక్షన్స్ అయితే కష్టమే. వాళ్లకు ఇప్పటి వరకు ఆ అవకాశమే రాలేదు. అయితే తాజాగా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరూ ఊహించని విధంగా కొత్త యాంకర్ సందడి చేశాడు. అతనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నవీన్ పొలిశెట్టి.
జాతి రత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నవీన్. ప్రస్తుతం మనోడికి రూ.10 కోట్ల మార్కెట్ ఉంది. జాతి రత్నాలు దాదాపు 40 కోట్ల వరకు వసూలు చేసింది. దానికి ముందు ఆత్రేయ కూడా మంచి విజయం అందుకుంది. దాంతో నవీన్ పొలిశెట్టితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడుతున్నారు. ఓ క్రేజీ హీరో స్థాయిలో ఉన్న ఈ హీరో ఉన్నట్లుండి యాంకర్ అయిపోయాడు. అది చూసి చాలా మంది షాక్ అయిపోయారు. ఎందుకంటే క్రేజ్ రాకముందు ఈయన చాలా చేశాడు కానీ వచ్చిన తర్వాత ఇలాంటివి చేయడం అంటే మాటలు కాదు. కానీ నవీన్ చేశాడు. ఇప్పుడు అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకరింగ్ కోసం నవీన్ పొలిశెట్టి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే చర్చ బాగానే జరుగుతుంది. గుర్తింపు ఉన్న హీరో కాబట్టి బాగానే తీసుకుని ఉంటాడని అంతా అనుకుంటున్నారు కానీ అసలు ఈ ఈవెంట్ కోసం నవీన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదనే ప్రచారం జరుగుతుంది.
ఇది కేవలం రిలేషన్ కోసం నవీన్ చేసిన ఈవెంట్ అని తెలుస్తుంది. జాతిరత్నాలు సమయంలో ప్రభాస్ తన టైమ్ ఇచ్చి మరి సినిమాను బాగా ప్రమోట్ చేశాడు. అది బాగా హెల్ప్ అయింది కూడా. ట్రైలర్ విడుదల చేసింది కూడా ప్రభాసే. ఆ తర్వాత కూడా సినిమా గురించి బైట్స్ ఇచ్చాడు. అందుకే ఇప్పుడు ప్రభాస్ సినిమాకు తనకు చేతనైన ఉడత సాయం చేశాడు నవీన్. పైగా మనోడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. రాధే శ్యామ్ ఈవెంట్‌కు అన్ని భాషల వాళ్లు వచ్చారు. భాష కమ్యునికేట్ కావడానికి కూడా నవీన్ పోలిశెట్టిని తీసుకున్నారు. అన్నట్టు యూవీ క్రియేషన్స్‌లో హీరోగా నవీన్ ఒక సినిమా చేయబోతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Radhe Shyam Satellite rights | హాట్ టాపిక్‌గా రాధేశ్యామ్ శాటిలైట్ రైట్స్
Prabhas: నెంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్
రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉద్రిక్తత.. కృష్ణంరాజు కటౌట్ ఎక్కి కింద పడ్డ అభిమానులు
Radha Krishna About Radhe Shyam | ‘రాధేశ్యామ్’ వెనుక 12-15 ఏళ్ల కథ…సస్పెన్స్ పెట్టిన డైరెక్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

