టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR ). పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ భారీ ప్రాజెక్టు జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రాంచరణ్, ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. హిందీ, తమిళంతోపాటు వివిధ భాషల్లో రాబోతున్న ఆర్ఆర్ఆర్ కోసం ముంబై, చెన్నై సహా పలు పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేసింది జక్కన్న టీం.
కాగా నాన్న చిరంజీవి (Chiranjeevi) తనకు ఇచ్చిన ఉత్తమ సలహా ఏంటో చెప్పాడు రాంచరణ్. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంచరణ్ మాట్లాడుతూ…జీవితంలో క్రమశిక్షణ ఉంటే కెరీర్ సుదీర్ఘకాలం అద్బుతంగా ఉంటుందని నాన్న తనకు సూచించాడని చెప్పాడు. సినీ పరిశ్రమలో ఎలా సుదీర్ఘ ప్రయాణం కొనసాగించాలో తెలిపేందుకు నాకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) స్ఫూర్తి అని అన్నాడు.
వయస్సుతో సంబంధం లేకుండా ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న అక్షయ్‌నే తాను ఫాలో అవుతానని చెప్పుకొచ్చాడు రాంచరణ్. ఈ యువ హీరో మరోవైపు చిరంజీవితో కలిసి నటిస్తున్న ఆచార్య వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.