ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ పరిస్థితేంటి.. ముంబైలో గడ్డు పరిస్థితులు..!

RRR and Radhe shyam | చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర మళ్లీ సందడి కనిపిస్తుంది. అయితే అది మూడునాళ్ల ముచ్చటగా మిగిలిపోనుందా అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. రెండు మూడు నెలలుగా వైరస్ అనే మాట లేకుండా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. అఖండ, పుష్ప లాంటి సినిమాలు రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. తాజాగా విడుదలైన నాని శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి వసూళ్లు తీసుకొస్తుంది. ఇదే ఊపు కంటిన్యూ అయితే జనవరి 7న రాబోయే ట్రిపుల్ ఆర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఒమిక్రాన్ వైరస్ దేశాన్ని వణికిస్తుంది. మెల్లమెల్లగా కేసులు పెరుగుతూ ఉండటంతో అన్ని రాష్ట్రాలు జాగ్రత్త పేరుతో ఆంక్షలు విధించడం మొదలైంది.
ముఖ్యంగా మహారాష్ట్ర సహా మరో ఐదు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ( Night curfew ) తో పాటు కొన్ని ఆంక్షలు విధించారు. ఇది రాబోయే సినిమాలకు శరాఘాతంలా మారనుంది. మరీ ముఖ్యంగా రాధే శ్యామ్, ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలకు శాపం అయిపోయింది. ఎందుకంటే తెలుగు కంటే హిందీలోనే ఈ సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అక్కడే మార్కెట్ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో హిందీలో థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ విధించడంతో కలెక్షన్స్‌పై ఊహించని దెబ్బ పడనుంది. దీంతో జనవరి 7 వరకు పరిస్థితులు చక్కబడతాయా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కేసులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గదు అంటున్నారు. ఇలాంటి సమయంలో ఇన్ని అంశాల మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమాలు విడుదలైతే కలెక్షన్స్ ఎలా సరిపోతాయి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఏపీలో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రేట్లతో థియేటర్స్ నడపలేమని స్వచ్ఛందంగా అక్కడ యాజమాన్యం థియేటర్స్ మూసేస్తున్నారు. ఇలా ఎన్నో ప్రతికూలతల మధ్య పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. మరి వీటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR and Radhe shyam | ఆ విషయంలో రాజమౌళిని బీట్ చేసిన ప్రభాస్..
Naveen Polishetty | రాధే శ్యామ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత తీసుకున్నాడో తెలుసా..?
Radhe Shyam Satellite rights | హాట్ టాపిక్‌గా రాధేశ్యామ్ శాటిలైట్ రైట్స్
ట్రిపుల్ ఆర్తో పాటు ఆ సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్న రాజమౌళి..
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

