debut Heroines 2021 | ఉప్పెనతో బేబమ్మ మెస్మరైజ్ చేసింది.. చిట్టి తన నవ్వుతో పటాస్‌లాంటి హిట్ అందుకుంది. ఆరంభంలోనే అమ్మాయిగారు.. మెప్పించింది.. ఇక పెళ్లి సందడిలో మామూలు సందడి చేయలేదు శ్రీలీల. మొత్తం మీద ఈ భామలు.. 2021లో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని తమవైపు తిప్పుకున్నారు. వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నారు. వీళ్లే కాదు.. ఇంకా చాలామంది కొత్త తారలు తెలుగు ఇండస్ట్రీకి పరిచమయ్యారు. వీరిలో కొందరు తమ అందంతో మెప్పిస్తే.. మరికొందరు చతికలబడ్డారు. మరి 2021లో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం..
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కృతిశెట్టి. ఈ సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ఫొటోలు, సాంగ్స్‌తోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఉప్పెనలో బేబమ్మను చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రేజ్ చూసిన దర్శక నిర్మాతలు కూడా ఈమె డేట్స్ కోసం క్యూ కట్టారు. ఇప్పుడు ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తమ్మీద ఈ ఏడాది కృతి శెట్టికి రెండు హిట్లు వచ్చాయి.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారు. అలా ఈ ఏడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది శ్రీలీల. సినిమాలో పెళ్లి సందడి కంటే పిల్ల సందడే ఎక్కువగా ఉందనేలా పేరుతెచ్చుకుంది. శ్రీలీలను చూసి ఇటు ప్రేక్షకులు, అటు దర్శక నిర్మాతలు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. కానీ తన చదువు పూర్తయ్యే వరకు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని శ్రీలీల డిసైడ్ అయినట్లు సమాచారం.
చిట్టి.. అదే ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలతో అందర్నీ ఆకట్టుకుంది. తెలుగులో అనుష్క తర్వాత అంతటి హైట్ ఉన్న ఈ భామను చూసి తెలుగు ప్రేక్షకులు పడిపోయారు. చిట్టి నీ నవ్వంటే.. అంటూ పాటలు కూడా పాడుకున్నారు. అలా ఒక్క సినిమాతోనే అందర్నీ తనవైపు తిప్పుకుంది ఫరియా. ఈ సినిమా తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో గెస్ట్ రోల్లో మెరిసింది. ఇప్పుడు బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగచైతన్యతో కలిసి ఒక స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేసింది. నువ్వు పెళ్లి చేసుకెళ్లిపోతే బంగార్రాజు.. అనే ఈ పాటలో ఫరియా లుక్ ఆకట్టుకుంటుంది.
రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కూడా ఈ ఏడాది టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన అద్భుతం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిస్నీ హాట్ స్టార్‌లో నేరుగా విడుదలైన ఈ సినిమాలో శివాని యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈమె యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు. ఇక ఇదే ఏడాది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాతో కూడా వచ్చింది శివాని రాజశేఖర్.
పూరీ జగన్నాథ్ తనయుడు హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కేతిక శర్మ. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం కిందనే పూర్తయినప్పటికీ.. కరోనా కారణంగా ఈ సినిమా చాలారోజులు వాయిదా పడి.. చివరకు 2021లో రిలీజైంది. ఇదే ఏడాది నాగ శౌర్య హీరోగా వచ్చిన లక్ష్య సినిమాతోనూ పలకరించింది. కానీ ఈ రెండు సినిమాలు కేతిక శర్మకు నిరాశనే మిగిల్చాయి.
ఒక్క కన్ను గీటుతో కుర్రాళ్ల మతులు పోగొట్టేసిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నితిన్ హీరోగా వచ్చిన చెక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా దారుణంగా బెడిసి కొట్టింది. ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా వచ్చిన ఇష్క్ ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ సినిమాతోనూ పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ప్రియా వారియర్‌ను దారుణంగా నిరాశపరిచింది.
అమ్మాయిగారు.. అని అనగానే గుర్తొచ్చేది అమృత అయ్యర్. ప్రదీప్ మాచిరాజు హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలోని ఒక్క పాటతో తెగ పాపులర్ అయిపోయింది అమృత అయ్యర్. నిజానికి ఈ సినిమాలోనే మొదట నటించినప్పటికీ.. రెడ్ సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించింది ఈ మలయాళీ భామ. 2021 ఏడాది మొదట్లో వచ్చిన ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌ను మాయచేసింది. ఇప్పుడు ఏడాది చివరలో అంటే డిసెంబర్ 31న అర్జున ఫాల్గుణ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక కన్నడ సినిమాతో పాటు.. తెలుగులో హనుమాన్ సినిమా ఉంది.
వీళ్లే కాకుండా.. మీనాక్షి చౌదరి ( ఇచ్చట వాహనాలు నిలుపరాదు), తాన్య రవిచంద్రన్ ( రాజా విక్రమార్క ), కషిష్ ఖాన్ ( అనుభవించు రాజా ), నవమి గోయక్ ( నాంది ), లవ్లీ సింగ్ ( గాలి సంపత్ ), ఆర్జవీ (వివాహ భోజనంబు ) సహా పలువురు హీరోయిన్లు టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..
Allu Arjun Crying : సుకుమార్ లేకుంటే నేను లేను.. పుష్ప థ్యాంక్స్‌మీట్‌లో బన్నీ కన్నీళ్లు..
అనిల్ రావిపూడికి ఆ విషయంలో వెయిటింగ్ తప్పదా..?
అల్లు అర్జున్ తర్వాత సమంతకు జూనియర్ ఎన్టీఆర్ బంపర్ ఆఫర్..
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు అరెస్ట్ వారెంట్.. దిగొచ్చిన సినీ నిర్మాత..
SS Rajamouli | నేనా పని చేస్తే సుకుమార్‌కు గుండెపోటు వస్తుంది: రాజమౌళి
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..