2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..

debut heroes 2021 | సక్సెస్ ఎవరికీ ఊరికే రాదు. అందులో మొదటి సినిమాతోనే విజయం అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. 2021లో కొంతమంది హీరోలు అది చేసి చూపించారు. నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని తెలుగు ఇండస్ట్రీకి తమ ఎంట్రీ ఘనంగా చాటి చెప్పారు. తొలి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ కూడా సాధించి కెరీర్‌కు పునాది వేసుకున్నారు. మరి వాళ్లు ఎవరో చూద్దాం..
- వైష్ణవ్ తేజ్: ఉప్పెన సినిమాతో ఈ మెగా మేనల్లుడు తెలుగు ఇండస్ట్రీకి సంచలన ఎంట్రీ ఇచ్చాడు. కృతి శెట్టి కూడా ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ వసూలు చేసింది.
- రోషన్ మేక: నాలుగేళ్ల కిందట శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే అప్పుడు బాల నటుడిగానే ఉన్నాడు ఈయన. 2021లో ఈయన మెయిన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD సినిమాతో పరిచయం అయ్యాడు. దసరాకు విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా చివరికి సూపర్ హిట్ అయింది.
- ప్రదీప్ మాచిరాజు: దాదాపు పదేళ్లుగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. ఇప్పటికే కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. కానీ మెయిన్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా 2021 మొదట్లో విడుదలైంది. మున్నా తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
- తేజ సజ్జ: బాలనటుడిగా 40 సినిమాల్లో నటించిన అనుభవం తేజ సొంతం. రెండేళ్ల కింద సమంత హీరోయిన్గా వచ్చిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు తేజ సజ్జ. ఈయన మెయిన్ హీరోగా 2021లో జాంబి రెడ్డి సినిమా విడుదలైంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ నలుగురు హీరోలు మాత్రమే కాదు కమెడియన్ సత్య కూడా ఈ ఏడాది హీరో అయ్యాడు. ఆయన నటించిన వివాహ భోజనంబు సినిమా ఓటీటీలో విడుదలై మంచి అప్లాజ్ తెచ్చుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Allu Arjun Crying : సుకుమార్ లేకుంటే నేను లేను.. పుష్ప థ్యాంక్స్‌మీట్‌లో బన్నీ కన్నీళ్లు..
అనిల్ రావిపూడికి ఆ విషయంలో వెయిటింగ్ తప్పదా..?
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు అరెస్ట్ వారెంట్.. దిగొచ్చిన సినీ నిర్మాత..
SS Rajamouli | నేనా పని చేస్తే సుకుమార్‌కు గుండెపోటు వస్తుంది: రాజమౌళి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

