SS Rajamouli | నేనా పని చేస్తే సుకుమార్‌కు గుండెపోటు వస్తుంది: రాజమౌళి
రాంచరణ్ (Ram Charan), సుకుమార్..ఈ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం చిత్రానికి అద్బుతమైన స్పందన వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ రాబోతుంది అంటూ తెగ ఆలోచిస్తున్న సినీ జనాలకు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) క్లారిటీ ఇచ్చాడు.

తెలుగు ప్రేక్షకుల(Telugu Cinema)కు రంగస్థలం (Rangasthalam) లాంటి బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించారు రాంచరణ్ (Ram Charan), సుకుమార్. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సిల్వర్ స్క్రీన్‌పై అద్బుతమైన స్పందన వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ రాబోతుంది అంటూ ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై తెగ ఆలోచిస్తున్న సినీ జనాలకు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) క్లారిటీ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చరణ్,సుక్కూప్రాజెక్టు గురించి జక్కన్న మాట్లాడిన మాటలు హల్ చల్ చేస్తున్నాయి.
చరణ్‌కు సుకుమార్ (Sukumar) కొత్త సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ ను వినిపించాడు. నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడను..ఒకవేళ మాట్లాడితే సుకుమార్‌కు గుండెపోటు వస్తుంది. కానీ చరణ్‌కు చెప్పిన ఆ ఒక్క సీన్ చాలా కష్టమైనదని, అద్బుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. జక్కన్న తన స్నేహితుడు సుకుమార్ కొత్త మూవీ అప్ డేట్‌ను ఇలా సర్ప్రైజ్ ప్రకటనతో ఇచ్చి అందరిలో జోష్ నింపుతున్నాడు.
లేటెస్ట్ అప్ డేట్‌తో రంగస్థలం తర్వాత రాబోతున్న ఈ సినిమా ఎలాంటి స్టోరీతో రాబోతుందని ఇప్పటినుంచే తెగ చర్చించుకుంటున్నారు సినీ లవర్స్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఆర్సీ 15 మూవీతో బిజీగా ఉన్నాడు చరణ్. ఈ సినిమా తర్వాత RC16గా సుకుమార్ ప్రాజెక్టు ఉండబోతుందని టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

