అన్ని భాషల చిత్రాలకు ఆదరణ బాగుండాలని కోరుకునే వారిలో టాలీవుడ్ (Tollywood)సెలబ్రిటీలు ముందుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలాగే కోవిడ్ ప్రభావంతో కుదేలైన హిందీ ఇండస్ట్రీ కూడా ట్రాక్‌పైకి రావాల్సిన అవసరముందని ఇటీవలే స్టార్ హీరో అల్లు అర్జున్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. అంతేకాదు చాలా కాలం తర్వాత థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న హిందీ సినిమా (Bollywood films) అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశి (Sooryavanshi).
దివాళి కానుకగా థియేటర్లలో రిలీజవుతున్న సూర్యవంశి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని, ఇలాంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయాలని కోరుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా మరో టాప్ టాలీవుడ్ సెలబ్రిటీ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కూడా సూర్యవంశి టీంకు మద్దతుగా నిలిచారు.
Wishing #Sooryavanshi a grand success… Whole hearted appreciation to the team for holding the film for more than a year and a half to revive the theatre business in these tough times 👏🏻@akshaykumar #RohitShetty @ranveerofficial @ajaydevgn @karanjohar @dharmamovies @relianceent pic.twitter.com/vFERmrXPL0
— rajamouli ss (@ssrajamouli) November 3, 2021
‘సూర్యవంశి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ..కోవిడ్ కష్ట సమయాల్లో థియేటర్ వ్యాపారాన్ని పుంజుకోవడానికి ఏడాదిన్నర కంటే ఎక్కువ కాలంగా ఎదురుచూస్తూ సినిమా కోసం ఓపికగా పనిచేసిన టీంకు హృదయపూర్వక అభినందనలు..’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. తెలుగు సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ లభిస్తుండటంతో టాలీవుడ్ సెలబ్రిటీలు హిందీ సినిమాలను ప్రమోట్ చేయడం శుభపరిణామమనే చెప్పాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్