Anil Ravipudi | రాజమౌళి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అపజయం అంటూ తెలియకుండా అప్రతిహత జైత్రయాత్ర చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. 2015 లో పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. ఇప్పటి వరకు చేసిన 5 సినిమాలతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. సినిమాకు దాదాపు 12 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ అగ్ర దర్శకులలో ఒకడిగా నిలిచాడు అనిల్. ముఖ్యంగా గతేడాది సరిలేరు నీకెవ్వరు తర్వాత స్టార్ హీరోలు ఈయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అప్పటి వరకు కేవలం చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన అనిల్ రావిపూడి.. తాను స్టార్ హీరోలను కూడా హ్యాండిల్ చేస్తానని సరిలేరు నీకెవ్వరు సినిమాతో నిరూపించాడు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. 2019లో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు ఇది సీక్వెల్. కథ వేరుగా ఉంటుంది కానీ క్యారెక్టర్స్ మాత్రం అవే. అందుకే టైటిల్ కూడా ఎఫ్3 అని పెట్టాడు అనిల్ రావిపూడి. ఏప్రిల్ 29, 2022న ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు. అయితే బాలయ్యతో సినిమా కోసం అనిల్ రావిపూడి చాలా రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది.
అఖండ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టిన బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో తర్వాత సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకూ బాలయ్య మరో సినిమా చేసే అవకాశం లేదు. ఈ లోపు బాలకృష్ణ కోసం అదిరిపోయే కమర్షియల్ మాస్ కథను సిద్ధం చేసే పనిలో బిజీ కానున్నాడు అనిల్ రావిపూడి. మరోవైపు అఖండ సినిమా సాధించిన విజయం చూసిన తర్వాత బాలకృష్ణ కోసం ఎలాంటి కథ సిద్ధం చేయాలి అనే విషయంపై కూడా అనిల్ భారీగా కసరత్తులు చేస్తున్నాడు. కథ రొటీన్‌గా ఉన్నా కూడా కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నాడు. భారీ బడ్జెట్‌తోనే ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ఏదేమైనా బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vijayashanti | బాలయ్య సినిమాలో విజయశాంతి?
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Pushpa | పుష్ప ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే