Vijayashanti | బాలయ్య సినిమాలో విజయశాంతి?

Vijayashanti in Balakrishna movie | తెలుగు ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే ఎవరు.. ఇప్పుడు నయనతార అని చెప్తున్నారు కానీ ఎవర్ గ్రీన్ లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి మాత్రమే. లేడీ అమితాబ్ అంటూ అభిమానులతో ఆప్యాయంగా పిలిపించుకుంది ఈమె. వందల సినిమాల్లో నటించి తనకంటూ ఎప్పటికీ చెరిగిపోలేని గుర్తింపు సంపాదించుకున్నారు విజయశాంతి. ముఖ్యంగా 80, 90వ దశకంలో విజయశాంతి ఓ సంచలనం. ఈమె సినిమా వచ్చిందంటే హీరోలతో సమానంగా వసూళ్లు సాధించేవి. హీరోలతో పని లేదు అంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోయిన్ విజయశాంతి. ఈమె నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు కొందరు హీరోలతో ఈమె కాంబినేషన్ అదుర్స్. అందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఈ కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు రికార్డులను తిరగరాశాయి. ఎన్నో సంచలన విజయాలకు కేరాఫ్‌గా నిలిచాయి ఈ జోడీలు. అయితే కర్తవ్యం తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు అడుగులు వేసిన విజయశాంతి హీరోలతో నటించడం ఆపేసింది. అలా చిరంజీవి, బాలకృష్ణతో విజయశాంతి జోడికి బ్రేక్ పడింది. ఆ తర్వాత 2006లో వచ్చిన నాయుడమ్మ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చి మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరులో నటించింది. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న రూ.70 లక్షల పారితోషికం అందుకుంటే.. విజయశాంతికి మాత్రం 2 కోట్ల వరకు ఇచ్చారని ప్రచారం జరిగింది.
ఈ చిత్రం తర్వాత విజయశాంతికి కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చాయి. కానీ ఈమె మాత్రం ఒక్క సినిమాకు కూడా ఓకే చెప్పలేదు. అందులో చిరంజీవి సినిమా కూడా ఉండటం విశేషం. చిరంజీవి లూసీఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్‌లో కూడా ఈమెను నటించాల్సిందిగా కోరారు కొందరు. ఇదే విషయం విజయశాంతి కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో నటించడం కుదరదని చెప్పినట్లు తెలిపింది విజయశాంతి. తాజాగా బాలకృష్ణ సినిమాలో నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఒక కీలక పాత్ర కోసం విజయశాంతిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. 1993లో వచ్చిన నిప్పురవ్వ సినిమాలో చివరిసారిగా బాలకృష్ణ, విజయశాంతి ఇద్దరూ కలిసి నటించారు. మరి చిరంజీవికి నో చెప్పిన విజయశాంతి.. బాలయ్యకు ఎస్ చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రూ.14 కోట్ల లాభాలు వచ్చినా.. అఖండ అక్కడ ఇంకా సేఫ్ అవ్వలేదుగా..
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
సాయిపల్లవితో అలాంటి సినిమా చేయాలని అనుకున్నా: నాని
RRR | బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

