రూ.14 కోట్ల లాభాలు వచ్చినా.. అఖండ అక్కడ ఇంకా సేఫ్ అవ్వలేదుగా..

Akhanda collections | ఏడాది చివరలో కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు కూడా కొండంత నమ్మకం ఇచ్చిన సినిమా అఖండ. ఈ ఒక్క సినిమా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మీరు థియేటర్స్ లో సినిమాలు విడుదల చేయండి.. మేము చూస్తామని పూర్తి స్థాయిలో ప్రేక్షకులు నమ్మకం కలిగించిన సినిమా అఖండ. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే రూ.67 కోట్ల షేర్ వసూలు చేసి సంచలన విజయం నమోదు చేసుకుంది. తొలిరోజు సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడా వెనుకబడలేదు అఖండ.
విడుదలైన 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్ వసూలు చేసింది అంటే బాలయ్య దూకుడు బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పటికే కొన్ని చోట్ల ఫేస్ అవ్వలేదు అంటే ఆశ్చర్యం తప్ప మరొకటి లేదు. బాలకృష్ణ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా రూ.53 కోట్ల బిజినెస్ చేసింది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో ఇంత బిజినెస్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కోట్లు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో బాక్సాఫీస్‌పై దండెత్తాడు బాలయ్య. మొదటి వారంలోనే 50 కోట్ల షేర్ వసూలు చేసింది అఖండ సినిమా. రెండో వారం కూడా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చింది.
ఓవర్సీస్, నైజాంలో అఖండ సినిమాకు భారీ లాభాలు వచ్చాయి. అయితే ఏపీలో ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఈ సినిమా వెనుకబడి ఉంది. ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాల్లో అఖండ సినిమా సేఫ్ అవ్వలేదు. ఉత్తరాంధ్రలో మరో రూ.50 లక్షలు వెనుకబడి ఉంది అఖండ. మరోవైపు ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాలో కూడా 20, 30 లక్షలు తీసుకు రావాలి. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. ఇక్కడ మినహా అన్ని చోట్ల అఖండ విజయదుందుభి మోగించింది. మూడో వారంలో కచ్చితంగా ఆ మిగిలిన ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది అఖండ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
Bala Krishna: మల్టీ స్టారర్ చేసేందుకు సిద్ధమని చెప్పిన బాలకృష్ణ
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్
Akhanda: విజయోత్సవ వేడుకలో సాష్టాంగ నమస్కారం చేసి ఆశ్చర్యపరచిన హీరోయిన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

