అఖండ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నారు బాలకృష్ణ. ఆయన ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా ఓటీటీ కోసం అన్‌స్టాపబుల్ అనే షో చేస్తున్నాడు.అయితే అఖండ సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘అఖండ’ చిత్రం విజయవంతం కావడంతో చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యమొచ్చిందన్నారు.
మన సనాతన ధర్మాన్ని తెలియజేసిన చిత్రం ‘అఖండ’. దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్ చేస్తా. ఏపీలో ఉన్న సినిమా టికెట్ ధరల విషయంపై కూడా స్పందించిన ఆయన టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అనంతరం మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామిని ‘అఖండ’ చిత్రబృందం దర్శించుకుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలకృష్ణ-చిరంజీవి మల్టీ స్టారర్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ ఇద్దరు కలిసి చేసేందుకు సుముఖంగా ఉన్నారని, ఓ దర్శకుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్య.. మహేష్ బాబుతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది.
#BlockbusterAkhanda team, Natasimham #NandamuriBalakrishna, Director #BoyapatiSreenu and Producer #MiryalaRavinderReddy visited Kanaka Durga temple in Vijayawada.@dwarakacreation pic.twitter.com/FXgqxsZOdZ
— BA Raju's Team (@baraju_SuperHit) December 15, 2021
#BlockbusterAkhanda Team at Kanaka Durga temple in Vijayawada.
— BA Raju's Team (@baraju_SuperHit) December 15, 2021
Natasimham #NandamuriBalakrishna, Director #BoyapatiSreenu and Producer #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/pq5AqCSdaq