Allu Arjun Crying : సుకుమార్ లేకుంటే నేను లేను.. పుష్ప థ్యాంక్స్‌మీట్‌లో బన్నీ కన్నీళ్లు.. వీడియో

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీని పక్కనబెడితే.. మిగిలిన ఇండస్ట్రీల్లో ఊహించని కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలో పుష్ప సినిమా థ్యాంక్స్ మీట్‌ను తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుకుమార్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యాడు.
పుష్ప థ్యాంక్స్ మీట్లో మాట్లాడిన అల్లు అర్జున్.. తాను తన తాత అల్లు రామలింగయ్య, తల్లిదండ్రులు.. అలాగే ఫస్ట్ సినిమా నుంచి ప్రోత్సహిస్తున్న చిరంజీవి గారికి రుణపడి ఉంటానని చెప్పాడు. ఆ తర్వాత ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది సుకుమార్ ఒక్కడికే అని చెప్పుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. పరుగు సినిమా సమయంలో 85 లక్షలు పెట్టి ఒక స్పోర్ట్స్ కారు కొనుక్కున్నానని.. ఆ కారులో వెళ్తూ స్టీరింగ్‌పై చేయి పెట్టి నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఎవరని ఆలోచిస్తే ఫస్ట్ గుర్తొచ్చిన పేరు సుకుమార్ అని తెలిపాడు. సుకుమార్ ఆర్య సినిమా లేకుంటే ఏవీ ఉండేవి కాదు. కెరీర్ మొదట్లో సుకుమార్‌తో సినిమా చేయకపోతే నా లైఫ్ వేరేలా ఉండేది. నా లైఫ్‌లో సుకుమార్ ఉంటే ఒకలా ఉండేది.. లేకుంటే మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఈ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ఇవేవీ ఉండేవి కావని అన్నాడు. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన సుకుమార్‌కు ధన్యవాదాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బన్నీ ఎమోషనల్ స్పీచ్ విన్న సుకుమార్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pushpa | ఆ సీన్లో అల్లు అర్జున్ న్యూడ్‌గా కనిపించాల్సింది.. సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
పుష్పలో ఐటెం సాంగ్‌కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

