పాన్ ఇండియా చిత్రంగా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది టాలీవుడ్ (Tollywood) ప్రాజెక్టు పుష్ప (Pushpa). స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా కనిపించగా..కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika mandanna) హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేస్తుంది. కాగా డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ సినిమా గురించి చెప్పిన ఓ సీక్రెట్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో ఓ సీన్ ముందుగా అనుకున్నది కాదట.
మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ఈ విషయం చెప్పాడు సుకుమార్. క్లైమాక్స్ లో ముందుగా వేరే సీన్ రాసుకుని, షూట్ కూడా చేశాడట. ఆ సీన్లో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ న్యూడ్‌గా నటించాల్సి ఉంది..అయితే ఆ సన్నివేశం మాత్రం పెట్టలేదు. మరీ అంత అతిగా న్యూడ్ సీన్ తెలుగు ప్రేక్షకులకు నచ్చదని భావించి ఆ సీన్ పెట్టలేదని చెప్పుకొచ్చాడు సుకుమార్.
అయితే ఇలాంటి మార్పులు, చేర్పులు చేసినా పుష్ప..ది రైజ్‌లో పెట్టిన కొన్ని సన్నివేశాలు
ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.