తక్కువ కాలంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించి ‘నేషనల్ క్రష్’ గా నిలిచింది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). కిరిక్ పార్టీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమాతో స్టార్ డమ్ కొట్టేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం పుష్పలో నటిస్తోంది.
ఈ ఏడాది మిషన్ మజ్ను (Mission Majnu) చిత్రంతో తొలిసారి హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. రష్మిక, బాలీవుడ్ (Bollywood) హీరో సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra)తో కలిసి నటిస్తోన్న మిషన్ మజ్ను విడుదల తేదీపై అప్డేట్ వచ్చింది. 2022 మే 13న వేసవి కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది రష్మిక.
Get ready to be a part of India’s greatest covert operation that derailed Pakistan’s illicit Nuclear Ambitions!
— Rashmika Mandanna (@iamRashmika) November 2, 2021
Inspired by real events, #MissionMajnu releasing on 13th May 2022 in a cinema near you🍿🎬@SidMalhotra @RonnieScrewvala @amarbutala #GarimaMehta @RSVPMovies pic.twitter.com/bCWPj09zyp
మిషన్ మజ్ను చిత్రీకరణ పూర్తవగా..ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రష్మిక మరోవైపు హిందీలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్ బై సినిమా చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?