Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
మార్వల్ స్టూడియోస్ (Marvel Studios) నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉంటారు. ఆ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 25వ సినిమా ఎటర్నల్స్ (Eternals)2021. సినీ ప్రముఖులు కూడా ఎటర్నల్స్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.

మార్వల్ స్టూడియోస్ (Marvel Studios) నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు కూడా ఆ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 25వ సినిమా ఎటర్నల్స్ (Eternals)2021. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒకే స్క్రీన్ పై 10 మంది సూపర్ హీరోస్ (Super heroes)ను చూపించబోతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎటర్నల్స్ చిత్రం విడుదల కానుంది. మార్వెల్ స్టూడియోస్ ఎటర్నల్స్ సినిమాలో గెమ్మా ఛాన్ (Gemma Chan), రిచర్డ్ మేడెన్ (Richard Madden), కుమాల్ నాంజాయిని, లియా మేక్ హ్యూజ్, బ్రెయిన్ టైరి హెన్రీ, లరెన్ రిడల్ఫ్, బ్యారీ కాగన్, డాన్ లీ, కిట్ హరింగ్టన్, సల్మా హాయక్ (Salma Hayek), అకాడమీ అవార్డు గ్రహీత ఏంజెలీనా జోలీ (Angelina Jolie) నటిస్తున్నారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్, నెట్ మూరె నిర్మిస్తున్నారు.
2020లో నోమద్ ల్యాండ్ ఈ సినిమాతో అకాడమీ అవార్డు గెలుచుకున్న క్లో ఝా ఎటర్నల్స్ సినిమాను తెరకెక్కించారు. ఒలంపియా గ్రహం నుంచి వేలాది సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చిన మరణం లేని ఏలియన్స్ ఈ ఎటర్నల్స్. వీళ్ళనే డేవిఎన్ట్స్ అంటారు. మానవత్వాన్ని కాపాడడమే వీళ్ళ పని. ఎటర్నల్స్ కు ఎన్నో పవర్స్ ఉంటాయి. వాళ్లలో అందరు సూపర్ హీరోలు ఒకే రకమైన శక్తి కలిగి ఉంటారు. అందులో కొంతమంది ఆలోచించే వాళ్ళు.. మరికొంతమంది శక్తివంతులు.. ఇంకొందరు ఫైటర్స్ వుంటారు. కానీ ఈ గ్రూప్ లో అందరికీ సమానమైన శక్తులు ఉంటాయి.
ఈ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఎటర్నల్స్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. అందులో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఉన్నారు. ఎటర్నల్స్ సినిమా కోసం తాను చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నట్లు తెలిపారు ఈమె. సమంత మాట్లాడుతూ.. ‘మనందరం సూపర్ హీరోలను ఎంతగానో ప్రేమిస్తాం..ఇప్పుడు మరో కొత్త రూపంలో వాళ్ళంతా మన ముందుకు వస్తున్నారు.. సూపర్ హీరోస్‌ను స్క్రీన్ పై చూడటానికి నేనెంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాను’ అంటూ తెలిపారు.
అలాగే సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)సైతం ఎటర్నల్స్ విడుదల కోసం ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎటర్నల్స్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నిచోట్ల బుకింగ్స్ చాలా వేగంగా పూర్తవుతున్నాయి. దీన్ని బట్టి ఎటర్నల్స్ సినిమాపై ఇండియాలోనూ భారీ అంచనాలున్నాయనేది స్పష్టమవుతుంది. ఈ దీపావళి క్రేజ్ సూపర్ హీరోస్ మరింత పెంచేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

