Rashmika mandanna Apology | కన్నడిగులకు రష్మిక క్షమాపణలు.. కారణం చెప్పిన అల్లు అర్జున్
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప (Pushpa). రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ పేరు కన్నడ హీరోయిన్ అయినా పాపులారిటీ సంపాదించింది మాత్రం టాలీవుడ్లోనే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

టాలీవుడ్ (Tollywood)తోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప (Pushpa). అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటిస్తుండగా..కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ పేరు కన్నడ హీరోయిన్ అయినా పాపులారిటీ సంపాదించింది మాత్రం టాలీవుడ్లోనే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. యూట్యూబ్ లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సంపాదిస్తున్నాయి.
అయితే పుష్ప తెలుగు వెర్షన్లో శ్రీవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్న రష్మిక మందన్నా మాతృభాషలో మాత్రం చెప్పుకోలేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు నగరాల్లో చక్కర్లు కొడుతోంది బన్నీ, రష్మిక టీం. అయితే కన్నడిగులను నిరాశపరిచినందుకు సారీ చెప్పింది రష్మిక.

రష్మికనే వాయిస్ ఇవ్వాలనుకుంది..కానీ
బెంగళూరులో మీడియాతో చిట్ చాట్ చేసింది రష్మిక. కన్నడ వెర్షన్లో డబ్బింగ్ ఎందుకు చెప్పుకోలేదని రిపోర్టర్ అడిగాడు. రష్మిక పక్కనే ఉన్న అల్లు అర్జున్ దీనిపై స్పందిస్తూ..రష్మికనే వాయిస్ ఇవ్వాలనుకుంది…కానీ సినిమా పూర్తి చేసేందుకు టైం లేకపోవడంతో డబ్బింగ్ చెప్పుకోలేకపోయిందన్నాడు. ఇప్పటిదాకా షూటింగ్‌తోనే బిజీగా ఉన్నాం. సినిమా వర్క్‌ను వేగంగా పూర్తి చేయాలనుకుని సుకుమార్ డబ్బింగ్ ఆర్టిస్టుల సాయం తీసుకున్నారని చెప్పుకొచ్చాడు.

సెకండ్ పార్టులో చెప్తా..
దీనిపై రష్మిక స్పందిస్తూ..పుష్ప ఫస్ట్ పార్టులో శ్రీవల్లి పాత్రకు మాతృభాషలో డబ్బింగ్ చెప్పలేకపోయినందుకు తన ఫాలోవర్లు, అభిమానులను క్షమాపణలు కోరింది రష్మిక. అయితే పుష్ప సెకండ్ పార్టులో తప్పకుండా డబ్బింగ్ చెప్తానని ప్రామిస్ చేస్తున్నట్టు చెప్పింది. ఈ చిత్రంలో పుష్పరాజ్ ప్రేమలో పడే శ్రీవల్లి పాత్రలో నటించింది రష్మిక మందన్నా. మరి బన్నీ-రష్మిక లవ్ ట్రాక్ సిల్వర్ స్క్రీన్‌పై ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

