పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..

pushpa second part | టాక్‌తో సంబంధం లేకుండా పుష్ప సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. దాంతో రెండో భాగం ఎలా ఉండబోతుందో అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. దానికి తోడు మొదటి భాగం కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. సుకుమార్ రెండో భాగం మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రన్ టైం ఎక్కువగా లేకుండా రెండున్నర గంటలకు మించకుండా రెండో భాగం పూర్తి చేయనున్నాడు ఈ దర్శకుడు. దానికోసం లెక్కలు వేసుకుంటున్నాడు ఈ లెక్కల మాస్టారు. ఎవరి పాత్ర ఎంత వరకు ఉండాలి.. ఎలా ఉండాలి అనే డిజైనింగ్ వర్క్ ఇప్పటికే మొదలైపోయింది. 2022 ఫిబ్రవరి నుంచి పుష్ప ది రూల్ షూటింగ్ మొదలు కానుంది. తాజాగా పుష్ప 2 గురించి ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
పుష్ప రెండో భాగం కథ ఇలా ఉండబోతుంది.. అలా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా పుష్ప రెండో భాగం గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. రెండో భాగం ఎక్కువగా ఈగో క్లాష్ మీద వెళ్తుందని మొదటి భాగం క్లైమాక్స్‌లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. పూర్తిగా అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ మధ్య జరిగే కథ ఇది. ఇదిలా ఉంటే రెండో భాగంలో అదిరిపోయే ట్విస్ట్ లు ఉంటాయని.. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ కంటే కూడా ఎమోషనల్ పార్ట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మరో అదిరిపోయే వార్త ఏంటంటే సెకండ్ పార్ట్‌లో హీరోయిన్ శ్రీవల్లి పాత్ర చనిపోవడం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ రష్మిక మందన పాత్ర మాత్రం రెండో భాగంలో చనిపోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
పుష్పతో పెళ్లయిన తర్వాత ఒక పెద్ద ఫైట్ ఉంటుందని.. ఆ ఫైట్ లో భాగంగానే శ్రీవల్లి పాత్ర మరణిస్తుందనే ప్రచారం జరుగుతోంది. సినిమాలో హీరోయిన్ చనిపోవడం అంటే చిన్న విషయం కాదు.. ఆ తర్వాత జర్నీ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. పుష్ప రెండో భాగం కూడా ఇలాగే ఉండబోతోందని తెలుస్తోంది. మరోవైపు అనసూయ, సునీల్ క్యారెక్టర్స్ రెండో భాగంలో మరింత బలంగా మారబోతున్నాయని.. ప్రతీకారం నేపథ్యంలో ఈ కథ ముందుకు వెళుతుందని తెలుస్తోంది. ఇలా సోషల్ మీడియాలో పుష్ప రెండో భాగం గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ వచ్చే ఏడాది సమాధానం దొరుకుతుంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుష్పలో ఐటెం సాంగ్‌కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో హైయ్యస్ట్ ఫస్ట్ డే షేర్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

