Nora Fatehi | దిల్బర్ గర్ల్ నోరా ఫతేహికి కరోనా పాజిటివ్
Nora Fatehi test positive Covid-19 | బాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే కరీనా కపూర్‌తో పాటు పలువురు కరోనా బారినపడ్డారు. నిన్న నటుడు అర్జున్

ముంబై : బాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే కరీనా కపూర్‌తో పాటు పలువురు కరోనా బారినపడ్డారు. నిన్న నటుడు అర్జున్ కపూర్‌తో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. తాజాగా దిల్బర్ గర్ల్ నోరా ఫతేహి (Nora Fatehi)కి సైతం కరోనా సోకింది. దీంతో నోరా హోం క్వారంటైన్లోకి వెళ్లింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని నోరా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
‘ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నాను. దయచేసి మీరందరూ సురక్షితంగా ఉండండి. మాస్క్ ధరించండి. జీవితం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు’ అంటూ పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ముంబైలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో షూటింగ్‌పై ప్రభావం పడుతున్నది. ఇప్పటికే పలు సినిమాలు సైతం వాయిదా పడ్డాయి. మరో వైపు పెరుగుతూ వస్తున్న కేసుల దృష్ట్యా ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు రాత్రి కర్ఫ్యూ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

