హిట్ 2 అందుకే వదిలేశా.. అసలు కారణం చెప్పిన విశ్వక్ సేన్
సాధారణంగా ఒక సినిమా హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ తీస్తే అందులో కూడా అదే హీరో ఉంటాడు. కానీ ఇప్పుడు నాని మాత్రం హిట్ సినిమా సీక్వెల్ కోసం విశ్వక్ సేన్ ను కాదని అడవి శేష్ ను తీసుకున్నాడు.

సాధారణంగా ఒక సినిమా హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ తీస్తే అందులో కూడా అదే హీరో ఉంటాడు. కానీ ఇప్పుడు నాని మాత్రం హిట్ సినిమా సీక్వెల్ కోసం విశ్వక్ సేన్ ను కాదని అడవి శేష్ ను తీసుకున్నాడు. ఈ సినిమాను విశ్వక్ కావాలని వదిలేశాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. మరొకటి విశ్వక్ సేన్ ప్రస్తుతం పాగల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను నరేష్ కుప్పిలి తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 30న థియేటర్స్ లోకి రానుంది పాగల్. ఇందులో విశ్వక్ సేన్ సరసన నివేథా పేతురాజ్ కథానాయకగా నటిస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ పాగల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాను హిట్ సినిమా సీక్వెల్ లో ఎందుకు నటించడం లేదని చెప్పాడు విశ్వక్ సేన్.
శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మించాడు. ‘హిట్2’ కథ కూడా ముందు విశ్వక్ దగ్గరికి వచ్చింది. అయితే డేట్స్ సర్దుబాటు కాలేదని చెప్పుకొచ్చాడు ఈ హీరో. ఈ సినిమా మిస్ చేసుకోవడం నిజంగా బాధగా ఉందని చెప్పాడు విశ్వక్.
ప్రస్తుతం మూడు సినిమాలు చేతిలో ఉన్నాయని.. అందుకే హిట్ సీక్వెల్ లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అలాగే’ఫలక్‌నుమా దాస్’ సీక్వెల్‌కు కూడా ప్లాన్ చేస్తున్నామని విశ్వక్ తెలిపాడు. ‘ప్రాజెక్టు గామీ’ అనే చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే పీవీపీ సంస్థలో, బీవీఎన్ ప్రసాద్ నిర్మాణంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు చెప్పాడు విశ్వక్. అందుకే హిట్ సీక్వెల్ వదిలేశాను అంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇర్ఫాన్ ఖాన్ దుస్తుల్లో ఫిల్మ్‌ఫేర్‌కు బాబిల్‌ఖాన్
దండేలి అడవుల్లో ప్రగ్యాజైశ్వాల్ ఏం చేస్తుందంటే..?
విమర్శల గురించి బాధపడొద్దు: ఇలియానా
అరణ్య 2 డేస్ కలెక్షన్స్.. ఇది సరిపోదు రానా
నేను పాగల్‌ను అనుకుంటారు: విశ్వక్ సేన్
కొత్త డైరెక్టర్ తో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్..!
పింక్ డ్రెస్ లో తమన్నా తళుక్కులు..ఫొటోలు వైరల్
సెకండ్ వేవ్‌తో భయపడుతున్న పాన్ ఇండియా సినిమాలు
హీరోపై చీటింగ్ కేసు.. బెయిల్ ఇవ్వొద్దంటూ డిమాండ్
18 ఏళ్ల గంగోత్రి.. ఎమోషనల్ అయిన అల్లు అర్జున్
నిరాశపరిచిన చావు కబురు చల్లగా.. గీతా ఆర్ట్స్ 2లో డిజాస్టర్
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
ప్రకృతి అందాల నడుమ హాట్ హాట్‌గా క్యూటీ భామ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- hit 2
- Tollywood
- vishwaksen
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

