Rajamouli | అజిత్ చేసిన పనికి ఫిదా అయిపోయిన రాజమౌళి..

Ajith and Rajamouli | హీరో అజిత్ కేవలం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అజిత్ సినిమాలు తెలుగులో సంచలనం సృష్టించకపోవచ్చు కానీ ఆయన అంటే ఇష్టపడే అభిమానులు చాలామంది తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. తెలుగు మూలాలు ఉన్న అజిత్ ప్రస్తుతం తమిళంలో నెంబర్ వన్ కుర్చీ కోసం పోటీ పడుతున్నాడు. సికింద్రాబాద్ నుంచి వెళ్లి చెన్నైలో చక్రం తిప్పుతున్నాడు ఈ హీరో. ఈయన చేసే సినిమాలు కోలీవుడ్‌లో ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధిస్తున్నాయి. తాజాగా వాలిమై ( Valimai ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అజిత్. ఈ సినిమా ట్రైలర్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైంది. CH వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే అజిత్ చేసిన ఒక పనికి ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి ఫిదా అయిపోయాడు.
తన పేరు ముందు తలా తోకా అవసరం లేదు.. కేవలం అజిత్ కుమార్ లేదంటే ఏకే అని పిలవండి అంటూ ఈ మధ్య ఒక ప్రెస్‌నోట్ విడుదల చేశాడు అజిత్. ఈయనను తమిళనాట అభిమానులు ముద్దుగా తలా అని పిలుస్తారు. తలా అంటే ఉన్నతమైన వ్యక్తి అని అర్థం. 20 ఏళ్లుగా అజిత్‌ను అలాగే పిలుచుకుంటున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు తనకు అలాంటి తోకలు అవసరం లేదని.. తలా అని పిలవద్దు అంటూ చెప్పాడు అజిత్. అందుకే ఇప్పుడు విడుదలైన ట్రైలర్లో కూడా కేవలం అజిత్ కుమార్ అని మాత్రమే ఉంది. ఇదే విషయంపై రాజమౌళి స్పందించాడు. అజిత్ చేసిన పనిని తాను నిజంగా అభినందిస్తున్నానని చెప్పాడు. కోట్లాది మంది అభిమానులు ఆయనను ‘తలా’ అని ప్రేమతో పిలుస్తారు.. కానీ తనను #Thala అని పిలవడం మానుకోవాలని అభిమానులను కోరడం.. అజిత్ / ఏకే / అజిత్ కుమార్ అని మాత్రమే పిలవాలని చెప్పడం అభినందనీయం అంటూ అజిత్ ను ప్రశంసించాడు జక్కన్న. ప్రస్తుతం ఈయన ట్రిపుల్ ఆర్ తమిళ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అజిత్‌పై వ్యాఖ్యలు చేశాడు రాజమౌళి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Thala Ajith: తనని అలా పిలవొద్దని కోరిన అజిత్.. ధోనినే కారణమా?
అజిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కార్తికేయ..
Vishwak sen | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌కు కరోనా పాజిటివ్..
Samantha | ఈసారి సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్లతోనే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

