karthikeya | ఒకప్పుడు తెలుగు, తమిళ హీరోలకు బాగా తేడా కనిపించేది. అక్కడి వాళ్లకు ఇక్కడ.. ఇక్కడి వాళ్లకు అక్కడ పెద్దగా ఫాలోయింగ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.. పరిస్థితులన్నీ మారిపోయాయి. భాషా భేదం లేని కంటెంట్‌తో వచ్చిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీల మధ్య ఉన్న కంచెను తెంపేశాయి. దాంతో ఇతర ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కూడా మన దగ్గర మంచి మార్కెట్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే మన హీరోలకు కూడా తమిళ కన్నడ భాషల్లో అద్భుతమైన మార్కెట్ ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే తెలుగు హీరోలు కొంతమంది తమిళంలో నటిస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో కోలీవుడ్‌కు వెళ్లిన టాలీవుడ్ హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈయన.. కేవలం హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా నటిస్తున్నాడు.
ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా కార్తికేయ విలనిజం సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమా ప్రతినాయక పాత్ర వెతుక్కుంటూ మరీ వచ్చింది. సిహెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న వాలిమై సినిమాలో అజిత్ కు పోటీగా నటిస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దీనికి సంబంధించిన విశేషాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు ఈ కుర్ర హీరో. పైగా తెలుగులో హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. టీజర్ ట్రైలర్ ఆసక్తి కరంగా ఉండటంతో రాజావిక్రమార్క కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని కార్తికేయ బలంగా నమ్ముతున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అజిత్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ కుర్ర హీరో. ముందుగా ఆయన సినిమాలో నటించాలంటే చాలా భయం వేసిందని.. అజిత్ ను కలవక ముందు వరకు కూడా ఒక రకమైన టెన్షన్ లో ఉన్నట్లు చెప్పాడు కార్తికేయ. అంత పెద్ద హీరో ముందుకు తాను వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి.. ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే భయం చాలా ఉందని.. కానీ ఒక్కసారి అజిత్ ను కలిసిన తర్వాత ఆ భయాలన్నీ ఎగిరిపోయాయి అంటున్నాడు కార్తికేయ. ఆకాశమంత స్టార్ డమ్ ఉండి కూడా అంత సింపుల్‌గా ఉండే హీరోను తాను ఎక్కడా చూడలేదు అంటున్నాడు కార్తికేయ. అందుకే అజిత్ సినిమాలో అవకాశం అనగానే కథ కూడా వినకుండా ఓకే చెప్పినట్లు ఆయన తెలిపాడు. ప్రస్తుతం తమిళం నుంచి కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయని.. అయితే కథ నచ్చితే తప్ప సినిమాలు సెలెక్ట్ చేసుకోను అంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ajith: 900 కిలోమీటర్లు బైక్ జర్నీ .. రష్యా అందాలు ఆస్వాదించాలనుకుంటున్న అజిత్
Karthikeya: కాబోయే భార్యని పరిచయం చేసిన కార్తికేయ.. అందరి ముందు ప్రపోజ్ చేసి షాకిచ్చాడు..!
Karthikeya: కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
చిరంజీవి పాత టైటిల్స్ వాడుకున్న హీరోల లిస్ట్ ఇదే..!
సూపర్ స్టార్ కృష్ణతో పూరీ జగన్నాథ్ మూవీ.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?