సూపర్ స్టార్ కృష్ణతో పూరీ జగన్నాథ్ మూవీ.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Puri jagannadh and super star krishna movie thillana | ఏంటి దర్శకుడు పూరీ జగన్నాథ్, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో సినిమా వచ్చిందా.. ఇది ఎప్పుడు జరిగింది.. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ దీని గురించి ఏ వార్త కూడా రాలేదు.. మరి ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వచ్చింది.. అయినా పూరీ మొదటి సినిమా బద్రి కదా అనే అనుమానాలు వస్తున్నాయి కదా..! కానీ పూరీ జగన్నాథ్ తొలి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు.. సూపర్ స్టార్ కృష్ణ ! మరి ఆ సినిమా ఏమైంది? ఎందుకు రిలీజ్ కాలేదు వంటి విషయాలు ఒకసారి చూద్దాం..

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పడిన ప్రతిసారి లేచి నిలబడటం ఈయన స్టైల్. కెరీర్లో ఎన్నో సార్లు ఎదురుదెబ్బలు తగిలినా కూడా మళ్లీ లేచి నిలబడి స్టార్ డైరెక్టర్ అయ్యాడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్. హిందీలో కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాత. 2022లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నాడు ఈ డేరింగ్ డైరెక్టర్. ఇదిలా ఉంటే ఈయన కెరీర్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.

2000వ సంవత్సరంలో బద్రి సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు పూరీ జగన్నాథ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్‌ను అప్పటి వరకు మరే దర్శకుడు చూపించనంత కొత్తగా బద్రిలో ఆవిష్కరించాడు. అయితే బద్రి కంటే ముందు పూరీకి రెండు సినిమాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. అందులో పాండు అనే సినిమా ఒకటి.. జగపతి బాబు హీరోగా ఈ సినిమాను మొదలు పెట్టి ఆపేశాడు పూరీ జగన్నాథ్. దాని కంటే ముందు 1996లో పూరీ జగన్నాథ్‌కు సూపర్ స్టార్ కృష్ణతో సినిమా చేసే అవకాశం వచ్చింది. డైరెక్టర్ కాకముందు రామ్‌గోపాల్ వర్మ, కృష్ణ వంశీ దగ్గర పూరీ జగన్నాథ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఒకవైపు అసిస్టెంట్‌గా పనిచేస్తూనే సీరియల్స్‌కు కూడా పనిచేశాడు. ఆ సమయంలో పూరీ టేకింగ్‌కు నిర్మాత ఐబీకే మోహన్ ఫిదా అయ్యాడు. పూరీతో ఒక సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ ఒక కథను రెడీ చేసుకుని సూపర్ స్టార్ కృష్ణకు వినిపించాడు. పూరీ చెప్పిన స్టైల్ కృష్ణకు బాగా నచ్చింది. దీంతో పూరీతో సినిమాకు కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్యాస్టింగ్ పూర్తి చేశారు. థిల్లానా ( Thillana ) టైటిల్‌తో సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా థిల్లానా సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ఆ తర్వాత థిల్లానా సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు పూరీ, కృష్ణ కాంబినేషన్ కుదరలేదు. కానీ ఆయన కొడుకు మహేశ్ బాబుతో పోకిరి, బిజినెస్ మెన్ లాంటి సంచలన విజయాలు అందించాడు పూరీ జగన్నాథ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
pawan kalyan | పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
pawan kalyan | మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
Puri jagannadh | పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథే
విడాకుల వరకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పిన పూరీ జగన్నాథ్
puri jagannadh | పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

