మేము ఐదుగురం కాదు.. ఎనిమిది మంది.. మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్

Power star pawan kalyan | మెగా కుటుంబం ( Mega family ) గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మెగా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. చిరంజీవి ( Mega star Chiranjeevi ) కారణంగా మెగా కుటుంబానికి సూపర్ పాపులారిటీ వచ్చింది. అందులోంచి ఇప్పుడు దాదాపు 10 మంది హీరోలు కూడా వచ్చారు. వాళ్లలో చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు స్టార్స్ కూడా అయ్యారు. ఇదిలా ఉంటే ఈ కుటుంబం గురించి ఇంకా తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అన్నీ తెలుసు అనుకునే అభిమానులకు కూడా చాలా విషయాలు తెలియకుండా ఉండిపోయాయి. అలాంటి టాప్ సీక్రెట్ బయటకొచ్చింది.
ఈ మధ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆయన బర్త్ డే జరుపుకోకపోయినా అభిమానులు మాత్రం ఘనంగా సెలబ్రెట్ చేశారు. నిజానికి మొదట్నుంచి పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే సెలబ్రెట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అయితే ఆయన ఎందుకు బర్త్ డే జరుపుకోరు అనే విషయంపై ఆయన అప్పట్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది. తమ కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉండటంతో ఆర్థిక స్థోమత సరిపోయేది కాదని.. ఆదాయం తక్కువగా ఉండటంతో పుట్టిన రోజు గురించి ఆలోచించుకునే సమయం ఉండేది కాదని ఆ ఇంటర్వ్యూలో పవన్ చెప్పాడు. తన వరకు చిన్నప్పటి నుంచి పుట్టిన రోజు అంటే కేవలం అమ్మ చేతి నుంచి ఇష్టమైన స్వీట్ తినడమే అంటున్నాడు పవర్ స్టార్.
మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఆ ఇంటర్వ్యూలో బహిర్గతం చేశాడు పవన్ కళ్యాణ్. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అంజనీదేవి, వెంకట్రావు దంపతులకు ఐదుగురు పిల్లలు అని అందరికీ తెలుసు. అందులో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ తోబుట్టువులు మొత్తం ఐదుగురు కాదంట.. మరో ముగ్గురు కూడా ఉన్నారంట. మరి వాళ్ల గురించి ఎందుకు బయటకు రాలేదంటే.. చిన్నప్పుడే వాళ్లు మరణించారంట. తన తల్లిదండ్రులకు ఎనిమిది మంది పిల్లలు పుడితే వారిలో ఐదుగురు మాత్రమే మిగిలారని ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు షాకవుతున్నారు. ఏదేమైనా కూడా ముగ్గురు పిల్లలు చనిపోయిన విషయాన్ని ఇప్పటి వరకు చిరు ఎక్కడా చెప్పకపోయినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం బయటపెట్టాడు.
ఇది కూడా చూడండి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
యజ్ఞం అసలు హీరో గోపీచంద్ కాదు.. మరి ముందు అనుకున్నది ఎవర్ని..?
సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
Pawan kalyan మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

