పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
HBD pawan kalyan | పవన్ కళ్యాణ్ అంటే యువతలో పిచ్చి క్రేజ్. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా పవర్ స్టార్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. తన కెరీర్లో చాలా సినిమాలే చేయాల్సింది. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలే కాకుండా మరో 10 సినిమాల వరకు ఈయన చేయాల్సింది కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని షూటింగ్ మొదలయ్యాక ఆగిపోతే.. కొన్ని అనౌన్స్మెంట్ అయ్యాక.. సెట్స్ ఎక్కడానికంటే ముందే అటకెక్కేశాయి. మరి పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..

చెప్పాలని ఉంది
శ్రీసూర్య మూవీస్ బ్యానర్లో ఏం.ఎం.రత్నం అప్పట్లో పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా తీయాలని అనుకున్నాడు. చెప్పాలని ఉంది కథతో సినిమాను మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్, అమీషా పటేల్‌పై కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా ఎందుకో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇదే కథను రామోజీరావు తీసుకుని నువ్వే కావాలి పేరుతో తెరకెక్కించాడు. తరుణ్, రిచా నటించిన ఈ సినిమా ఎంత బ్లాక్‌బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే.

సత్యాగ్రహి
జానీ సినిమా సమయంలోనే స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. దానికి సత్యాగ్రహి అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఏంఎం రత్నం బ్యానర్లోనే ఈ సినిమా ప్రారంభమైనా.. సెట్స్‌పైకి మాత్రం వెళ్లలేదు.

జీసస్ క్రైస్ట్
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాను చేయాలని అనుకున్నాడు. దానికి జీసెస్ క్రైస్ట్ అని టైటిల్ కూడా ఖరారైంది. అప్పట్లో పబ్లిక్‌గా ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అప్పట్లో ఇజ్రాయెల్ కూడా వెళ్లింది. కానీ ఎందుకో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

దేశి
దేశభక్తి నేపథ్యంలో కూడ పవర్ స్టార్ ఒక సినిమా తీయాలని అనుకున్నాడు. కానీ అనివార్య కారణాలతో ఈ సినిమా పట్టాలెక్కలేదు.

లారెన్స్‌తో సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని లారెన్స్ చాలాకాలంగా అనుకున్నాడు. పవన్ కోసం ఒక అద్భుతమైన కథ రాసినట్టు కూడా అప్పట్లో లారెన్స్ చెప్పాడు. పవర్ఫుల్ కథతో పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రకటించాడు. కానీ ఈ సినిమా అడుగు ముందుకుపడలేదు.

త్రివిక్రమ్‌తోనూ..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా తెరకెక్కాల్సింది. దీనికి కోబలి అని టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు. అయితే ఇదే కథలో పలు మార్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేత వీరరాఘవ సినిమా చేసినట్లు టాక్ కూడా ఉంది.

వినాయక్‌తో
వీవీ వినాయక్ కూడా పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా తీయాలని చాలా ఏండ్లుగా అనుకున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌పై ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆదిలోనే ఈ సినిమా ఆగిపోయింది.

గబ్బర్ సింగ్ 2
సంపత్ నంది డైరెక్షన్లో గబ్బర్ సింగ్ 2 చేస్తున్నట్లు అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఈయన చేసిన రచ్చ హిట్ కావడంతో పవన్.. ఆఫర్ ఇచ్చాడు. వీళ్ల కాంబినేషన్లో సినిమాను ప్రారంభించారు. కానీ ఏమైందో ఏమో సీన్లోకి బాబీ వచ్చాడు. సంపత్ నంది చెప్పిన కథను పక్కనబెట్టి వేరే కథతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించారు.

ఖుషీ 2
పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ఖుషీ. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని పవన్ కళ్యాణ్ చాలాసార్లు అనుకున్నాడు. ఖుషీ తర్వాత ఖుషీ 2 సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ చాలాసార్లు అనుకున్నాడు. ఇదే విషయాన్ని బయట కూడా చెప్పాడు పవన్. కానీ ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు.

ఎస్జే సూర్యతో
ఖుషీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ఎస్జే సూర్యతో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కాటమరాయుడు సినిమాకు ముందు ఈ సినిమాను ప్రారంభించారు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండా ఆగిపోయింది.

వేదాళం
అజిత్ హీరోగా ఏఎం రత్నం నిర్మించిన వేదాళం సినిమాను పవన్ కళ్యాణ్‌తో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ నీసన్ దర్శకత్వం వహించాల్సింది. కానీ ఈ సినిమా ఓపెనింగ్‌కు ముందే ఆగిపోయింది. ఇప్పుడు ఇదే సినిమాను భోళా శంకర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిన ఈయన ఎవరు ? నేపథ్యమేంటి ?
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన దర్శనం మొగులయ్య వాడే వాద్య పరికరం ఏంటో తెలుసా?
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

