Power star Pawan kalyan | ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తోటి హీరోలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసినవి తక్కువ సినిమాలే అయినా.. అభిమానుల్లో ఫాలోయింగ్ మాత్రం ఆకాశమంత ఉంటుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే.. అభిమానుల్లో జోష్ మామూలుగా ఉండదు. బాక్సాఫీసు బద్దలు కావాల్సిందే. ఇందుకు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలైన సమయంలో రిలీజైన వకీల్ సాబ్ సినిమానే నిదర్శనం. ఇక తాజాగా ఆయన నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్, టీజర్ కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇలా ఫ్యాన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ తన కెరీర్లో బ్లాక్‌బస్టర్ సినిమాలను వదిలేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు చేసి రవితేజ, మహేశ్ బాబు స్టార్ హీరోలుగా ఎదిగారు. మరి ఈయన కెరీర్లో వదిలేసుకున్న సినిమాలేంటో ఒకసారి చూద్దాం..
ఇడియట్ సినిమా కోసం పూరీ జగన్నాథ్ ముందుగా పవన్ కళ్యాణ్‌ను అనుకున్నాడు. బద్రి సినిమా హిట్ కావడంతో ఇదే కాంబినేషన్‌ను రిపీట్ చేద్దామని అనుకున్నాడు పూరీ. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లను మార్చాలని పూరీని పవన్ అడిగాడంట. కానీ దానికి పూరీ కాదనడంతో ఈ ప్రాజెక్ట్‌ను పవన్ కాదనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పుడప్పుడే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి సినిమాలతో హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న రవితేజతో పూరీ ఈ సినిమాను తీశాడు. 2002లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి కథను కూడా పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్నాడు పూరీ. ఈ సినిమా కిక్ బాక్సింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పటికే బాక్సింగ్ నేపథ్యంలోనే పవన్ జానీ సినిమా చేస్తూ ఉండటంతో ఈ సినిమాను కూడా పవన్ వదిలేసుకున్నాడు. దీంతో ఇడియట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ రవితేజతో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా తీశాడు పూరీ. ఈ సినిమాతో రవితేజకు మాస్ హీరోగా ఇమేజ్ దక్కింది.
ఇప్పటికీ అతడు సినిమా టీవీలో వస్తుందంటే చాలామంది అతుక్కుపోయి మరీ చూస్తుంటారు. త్రివిక్రమ్ మ్యాజిక్‌తో ఈ సినిమా క్లాసికల్‌గా నిలిచిపోయింది. ఇందులో పార్థూ క్యారెక్టర్ అంటే మహేశ్ ఇమేజ్ అలా కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ ఈ సినిమాకు త్రివిక్రమ్ ముందుగా పవన్ కళ్యాణ్‌ను అనుకున్నాడంట. కానీ అప్పటికి ఆయన డేట్స్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మహేశ్ చేతికి వెళ్లింది.
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. ఈ డైలాగ్‌ను మహేశ్ బాబు చెబితే థియేటర్లలో ఫ్యాన్స్ ఈలలు వేశారు. అదే ఈ డైలాగ్‌ను పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ చెబితే ఇంకా ఎలా ఉండేదో ఊహించండి. మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పోకిరి సినిమాను పవన్ కళ్యాణ్ చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నాడు. మహేశ్ ఈ సినిమా చేసి సూపర్‌స్టార్ అయిపోయాడు.
అండర్ కవర్ పాత్రలో మిరపకాయ్ సినిమాలో రవితేజ చేసిన సందడి అంతా ఇంతా కాదు. రవితేజకు బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ సినిమాకు ముందుగా అనుకున్నది మాస్ రాజాను కాదంట. పవన్ కళ్యాణ్ కోసం హరీష్ శంకర్ ఈ స్క్రిప్టు సిద్ధం చేశాడు. కానీ అప్పుడు ఈ సినిమాకు పవన్ ఓకే చెప్పలేదు. దీంతో హరీష్ శంకర్ ఈ సినిమాను రవితేజతో చేసి హిట్ కొట్టాడు.
గోపాల గోపాల సినిమాతో వెంకటేశ్, పవన్ కళ్యాణ్ జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే క్రేజ్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్నోడు పాత్రకు పవన్ కళ్యాణ్‌ను అనుకున్నారు. కానీ ఈ సినిమాను పవన్ వదులుకున్నాడు. దీంతో చిన్నోడు పాత్ర కోసం మహేశ్ బాబును తీసుకున్నారు. 2013లో రిలీజైన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.
మహేశ్ బాబుకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఒక్కడు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాల్సిందేనట. సీనియర్ రైటర్ తోట ప్రసాద్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు. ఒక్కడు సినిమాను దర్శకుడు గుణశేఖర్, నిర్మాత ఎమ్మెస్ రాజు ఇద్దరూ కూడా ముందుగా మహేశ్‌బాబుకి ఈ స్క్రిప్ట్ చెప్పారట. కానీ రోజులు గడుస్తున్నా మహేశ్ నుంచి స్పందన రాలేదు. దీంతో మహేశ్‌కు కథ నచ్చలేదేమోనని పవన్ కళ్యాణ్ వద్దకు స్క్రిప్ట్ తీసుకెళ్ధామని అనుకున్నారు. కానీ ఈలోపు మహేశ్ ఓకే చెప్పడంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. మహేశ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
Tollywood | హీరోయిన్ గా టాలీవుడ్ హీరో కూతురు..!
Power star పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా