తమిళ స్టార్ హీరో అజిత్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో రజనీకాంత్,కమల్ హాసన్,విజయ్‌ల తర్వాత అజిత్‌కి అభిమాన ఆదరణ ఎక్కువ. ప్రస్తుతం ఆయన వాలిమై చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం రష్యా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతో టీం అంతా చెన్నై తిరుగు ప్రయాణం అయింది. అజిత్ మాత్రం తాను రష్యాఅందాలని బైక్‌పై వీక్షించేందుకు సిద్ధమయ్యాడట. 900 కిలోమీటర్లు బైక్ పై జర్నీ చేసి రష్యా అందాలు ఆస్వాదించాలని అజిత్ ఫిక్స్ అయ్యారట . అజిత్ కు ఏరో-మోడలింగ్, పిస్టల్ షూటింగ్, ఫోటోగ్రఫీ, మోటార్ రేసింగ్‌తో పాటు, ఖరీదైన బైక్ లు మొదలైన వాటిపై చాలా ఆసక్తి ఉంది.
రోడ్ ట్రిప్లని బాగా ఇష్టపడే అజత్ హైదరాబాద్‌లో, సిక్కింలో బైక్‌పై కనిపించిన సంగతి తెలిసిందే. అజిత్ తన బైక్‌పై 10,800 కిమీల దూరం ప్రయాణించాడని సమాచారం. విభిన్న వాతావరణ పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి ఆయన ఈశాన్య భారతదేశానికి వెళ్లాడు. వాలిమై చిత్ర షూటింగ్లో భాగంగా అజిత్ రష్యాలోనే ఉంటున్నాడు.