నాని కేవలం హీరో మాత్రమే కాదు.. అభిరుచి గల నిర్మాత కూడా. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ఒకటి స్థాపించి అందులో మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నాడు నాచురల్ స్టార్. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. అద్భుతమైన పాటలను కూడా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నాడు నాని. ఈ క్రమంలోనే తాజాగా దారే లేదా అనే పాటను విడుదల చేసారు. ఈ మ్యూజికల్ వీడియోలో సత్యదేవ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూప నటించారు. కేకే రాసిన ఈ పాటను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సమర్పించాడు. ప్యాండమిక్ సిచ్చువేషన్ లో బయట డాక్టర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు.. కరోనా సమయంలో తమ కుటుంబాలను వదిలేసి మరీ మన కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది కళ్లకు కట్టినట్లు ఈ పాటలో చూపించారు.
ఈ వీడియోలో సత్యదేవ్, రూప ఇద్దరూ వైద్యులు.. భార్యాభర్తలు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల కోసం సేవలు చేస్తుంటారు. కనీసం వాళ్ల పెళ్ళి రోజును కూడా ఆనందంగా జరుపుకోలేని పరిస్థితి వస్తుంది. సరిగ్గా వాళ్ల పెళ్లి రోజే సత్యదేవ్ కు పాజిటివ్ వస్తుంది. దాంతో ఓ రూమ్ లో క్వారంటైన్ లోకి వెళ్లిపోతాడు. అయినా కూడా భార్యను విధులకు హాజరు కమ్మని చెప్తాడు. డాక్టర్స్ ఎంత నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేస్తున్నారో ఈ పాటలో చూపించారు. అలాగే చివర్లో నాని కూడా కనిపించాడు. మన కోసం ఇంత చేస్తున్న వైద్యులను గౌరవించడం మన బాధ్యత.. వాళ్లు చెప్పింది నిర్వర్తించడం మన విధి అంటూ గుర్తు చేసాడు నాచురల్ స్టార్.
కచ్చితంగా అంతా కలిసికట్టుగా ఉంటే ఈ కరోనాను తరిమికొట్టొచ్చు అని చూపించారు ఈ పాటలో. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ పాటను విడుదల చేసారు. నిజంగానే మనసును తాకేలా ఈ పాటను చిత్రీకరించారు. వైద్యులకు అరుదైన గౌరవాన్ని అందించారు. ప్రతీ 10 వేల మందిలో కేవలం 9 మంది డాక్టర్స్ మాత్రమే ఉన్నారని.. ప్యాండమిక్ మొదలైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 1400 మందికి పైగా వైద్యులు చనిపోయారని లెక్కలు చూపించారు. అందరం బాధ్యతగా ఉండాలని కోరుతున్నారు నాని అండ్ టీం.
ఇవి కూడా చదవండి..
కరోనాకు బలైన మరో ప్రముఖ నటుడు
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!