దక్షిణాది లీడింగ్ హీరోయిన్లలో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో ఉంటుంది సమంత (Samantha). తెలుగులో రాంచరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ తోపాటు కోలీవుడ్ స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ స్టార్ హీరోలకు ఇప్పటికే లగ్జరీ లాంబోర్గినీ కార్లు (Luxury Lamborghini Car) ఉన్నాయి. వీరి బాటలోనే వెళ్లేందుకు రెడీ అయిందట సామ్. సమంత తన భర్త నాగచైతన్య (Naga Chaitanya) కోసం లగ్జరీ లాంబోర్గినీ కొనేందుకు ప్లాన్ చేసిందట. సామ్ ఇప్పటికే బుకింగ్ కూడా పూర్తి చేసినట్టు టాక్.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu film industry) లో ఉన్న అత్యంత ధనవంతులైన సెలబ్రిటీల్లో సామ్-చైతూ కపుల్ ఒకరు. ఈ ఇద్దరు తమ సినిమాలకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇటీవలే గోవాలో ఓ ప్రాపర్టీని కూడా కొనుగోలు చేశారు. ఇపుడు తాజాగా వారి ఖరీదైన ప్రాపర్టీలలో లాంబోర్గిన్ కారు కూడా చేరనుంది. గుణశేఖర్ డైరెక్షన్ లో చేస్తున్న శాకుంతలం చిత్రంలో తన షూటింగ్ పార్టును పూర్తి చేసింది సమంత. ఇక ఈ మూవీ తర్వాత చేయబోయే కొత్త ప్రాజెక్టుపై మాత్రం సమంత ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు నాగచైతన్య స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చధా సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో నటించిన లవ్ స్టోరీ విడుదల కావాల్సి ఉంది.
ఇవికూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Upasana Surprise| ఉక్రెయిన్ లో ఉపాసన సర్ప్రైజ్..పోస్ట్ వైరల్