స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara), కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ పక్షులు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. చాలా నెలలుగా వీరి పెళ్లిపై ఏదో ఒక న్యూస్ అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఫైనల్ గా ఈ వ్యవహారంపై నయనతార నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. డిస్నీ +హాట్ స్టార్ ఫిల్మ్ నెట్రికన్ ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ షోకు హాజరైంది నయనతార.
టీవీ షో వ్యాఖ్యాత దివ్యదర్శినితో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చేతి వేలికున్న రింగ్ ను చూపించింది నయనతార . అంతేకాదు అది తన ఎంగేజ్ మెంట్ రింగ్ (Engagement ring) అని చెప్పింది. త్వరలోనే ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. నయనతార తాజా ప్రమోషనల్ వీడియోతో తనకు విఘ్నేశ్ శివన్ తో ఎంగేజ్ మెంట్ పూర్తయిందని హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది మార్చిలో చేతి వేలికి ఉంగరం పెట్టుకున్న నయనతార తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఒడిలో వాలిపోయిన స్టిల్ ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయింది. ‘వేలు జీవితంతో ముడిపడి ఉంది’ అంటూ విఘ్నేశ్ శివన్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుతో నయన్-విఘ్నేశ్ ఎంగేజ్ మెంట్ పై వార్తలు మరింత ఊపందుకున్నాయి.
మొత్తానికి ప్రమోషనల్ వీడియోతో తనకు నిశ్చితార్థం పూర్తయిందని, పెళ్లి ఒక్కటే మిగిలి ఉందని చెప్పకనే చెప్పింది నయనతార. 2015లో నానుమ్ రౌడీ ధాన్ సినిమా టైంలో ప్రేమలో పడ్డారు నయనతార-విఘ్నేశ్ శివన్. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో ఫీమేల్ లీడ్ పోషిస్తోంది. సమంత, విజయ్ సేతుపతి కీ రోల్స్ చేస్తున్నారు. నెట్రికన్ చిత్రాన్ని విఘ్నేశ్ శివన్ సమర్పిస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?