Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు మహేశ్ బాబు (Mahesh Babu). ఈ సూపర్ స్టార్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు మహేశ్ బాబు (Mahesh Babu). ఈ సూపర్ స్టార్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినీ లవర్స్ తోపాటు సెలబ్రిటీలు, రాజకీయ వేత్తల పిల్లల్లో చాలా మంది మహేశ్ బాబు తన ఫేవరేట్ హీరో అని చెప్తుంటారు. నాక్కూడా మహేశ్ బాబు అంటే చాలా ఇష్టమని, ఆయనకు తాను వీరాభిమాని అంటున్నాడు స్టార్ డైరెక్టర్ కొడుకు సాత్విక్ ( Satvick) . క్రాక్ సినిమాతో బాక్సాపీస్ ను షేక్ చేశాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ సినిమా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.
గోపీచంద్ మలినేని కొడుకు సాత్విక్ కు ఊహ తెలిసినప్పటి నుంచి మహేశ్ బాబు అంటే పిచ్చి.
మహేశ్ బాబును కలవాలని పట్టుబడితే గోపీచంద్ మలినేని తన కొడుకు సాత్విక్ ను సూపర్ స్టార్ నటిస్తోన్న సర్కారు వారి పాట సెట్స్ కు తీసుకెళ్లాడు. సాత్విక్ తన ఫేవరేట్ హీరో మహేశ్ బాబుతో కలిసి దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇక మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ విడుదల చేసిన సర్కారు వారి పాట టీజర్ కు అద్బుతమైన స్పందన వస్తోంది.
సూపర్ స్టార్ లవర్స్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్న మహేశ్ ను చూసి పండుగ చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురాం డైరెక్టర్. కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

