Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
సూపర్ హిట్ బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలకు కథలనందించిన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ (Vijayendraprasad). ‘కనబడుటలేదు’ (Kanabadutaledu) ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జీవీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తన స్టోరీలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ను ఆకట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలకు కథలనందించి తెలుగు, భారతీయ సినిమా ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ (Vijayendraprasad). సునీల్, సుక్రాంత్ మెయిన్ లీడ్స్ లో నటించిన చిత్రం ‘కనబడుటలేదు’ (Kanabadutaledu). శనివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు విజయేంద్రప్రసాద్ దర్శకుడు రామ్గోపాల్వర్మ (RGV)తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయేంద్రప్రసాద్. ఈ వేడుకలో విజయేంద్రప్రసాద్ స్టేజీపైకి వచ్చి తనదైన స్టైల్ లో ‘కనబడుటలేదు’ సినిమా టైటిల్ ను ఆర్జీవీకి అప్లై చేస్తూ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.
‘1989లో సినిమా తీస్తానని ఒక యువ కెరటం వచ్చింది. ఎక్కడా పనిచేయలేదు. సినిమాలు తీసిన అనుభవం లేదు. ఒక ప్యాషన్ తో సినిమా తీశాడాయన. కాలేజీ కుర్రాళ్లతోటి సైకిల్ చైన్స్ పట్టించాడు. ఆ మనిషి నాకు కనిపించడం లేదు. ఆ తర్వాత శ్రీదేవి అందాలను ఎవరు చూపనంత గొప్పగా చూపించాడాయన. జామురాతిరి జాబిలమ్మ అనే పాటతో కుర్రకారుకు పిచ్చెక్కించిన ఆ డైరెక్టర్ నాకు కనబడుటలేదు . ఆ తర్వాత సత్య, రంగీలా, కంపెనీ లాంటి అద్బుతమైన సినిమాలు తీసి కొన్ని వందల మంది డైరెక్టర్లను, ఆర్టిస్టులను, టెక్నీషియన్లకు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ డైరెక్టర్ నాకు కనిపించడం లేదు. నాకు అతన్ని మళ్లీ చూడాలని ఉంది..’ అంటూ విజయేంద్రప్రసాద్ ఆర్జీవీ గురించి చెప్పుకొచ్చారు.
ఇక విజయేంద్రప్రసాద్ కామెంట్స్ తో స్టేజ్ కిందున్న ఆర్జీవీ తన స్టైల్ లో ముసిముసిగా నవ్వాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది. బాలరాజు దర్శకత్వం వహించాడు.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

