Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
జుట్టు రాలడం అనేది చాలామందిని వేధించే సాధారణ సమస్య. సాధారణం కంటే ఎక్కువగా జుట్టు రాలుతుండటాన్ని గమనించినప్పుడు దానికి కారణమేంటో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఒత్తిడి, అనారోగ్యం, వేగంగా బరువు తగ్గడం, హార్మోన్లలో మార్పులు వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలుతుంది.
Hair Fall | జుట్టు రాలడం అనేది చాలామందిని వేధించే సాధారణ సమస్య. సాధారణం కంటే ఎక్కువగా జుట్టు రాలుతుండటాన్ని గమనించినప్పుడు దానికి కారణమేంటో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఒత్తిడి, అనారోగ్యం, వేగంగా బరువు తగ్గడం, హార్మోన్లలో మార్పులు వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలుతుంది. అయితే ఈ సమస్యకు కారణం ఇటీవల జరిగిన సంఘటన మాత్రమే కాదని, కొన్ని సందర్భాల్లో మూడు నెలల క్రితం ఎదురైన శారీరక లేదా మానసిక ఒత్తిడి ప్రభావం కూడా ఇప్పుడు కనిపిస్తుందని పోషకాహార నిపుణులు వివరించారు.
అధిక ఒత్తిడి ఉంటే..
శరీరం తీవ్రమైన అనారోగ్యం, అధిక ఒత్తిడి లేదా తక్కువ సమయంలో బరువు తగ్గించే ఆహార నియమాల వంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, జుట్టు పెరిగే దశలో ఉన్న కుదుళ్లలో చాలా వరకు విశ్రాంతి దశలోకి వెళ్తాయని వారు తెలిపారు. ఈ దశలో సుమారు 100 రోజుల పాటు కొనసాగిన తర్వాత జుట్టు రాలడం మొదలవుతుందని పేర్కొన్నారు. అందువల్ల జుట్టు రాలడానికి కారణాన్ని గుర్తించాలనుకునేవారు గత వారం రోజుల్లో జరిగిన మార్పులకే పరిమితం కాకుండా, సుమారు మూడు నెలల క్రితం ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అనారోగ్యం వంటి అంశాల్లో ఏవైనా మార్పులు జరిగాయా అని పరిశీలించాలని సూచించారు.
పోషకాల లోపం ఉండే అవకాశం..
జుట్టు రాలడం ఎక్కువకాలం కొనసాగితే శరీరంలో పోషకాల లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో పరీక్షించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. మొదటిది ఫెరిటిన్ పరీక్ష. ఇది శరీరంలో నిల్వ ఉన్న ఇనుము పరిమాణాన్ని సూచిస్తుంది. రెండోది థైరాయిడ్ పనితీరును అంచనా వేసే పరీక్షలు. కేవలం టీఎస్‌హెచ్ పరీక్షకే పరిమితం కాకుండా, వైద్యుల సూచన మేరకు అవసరమైన ఇతర థైరాయిడ్ పరీక్షలు కూడా చేయించుకోవాలని పేర్కొన్నారు. మూడోది ప్రోటీన్ తీసుకునే పరిమాణం. జుట్టు నిర్మాణంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుందని, రోజుకు ఎంత ప్రోటీన్ అవసరమో వ్యక్తి ఆరోగ్యం, శరీర అవసరాలను బట్టి నిర్ణయించుకోవాలని వివరించారు. ప్రోటీన్ తీసుకున్నప్పటికీ కడుపు ఉబ్బరం, గ్యాస్, భారంగా అనిపించడం వంటి సమస్యలు ఉంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.
ఫలితాలు వెంటనే కనిపించవు..
జుట్టు రాలడానికి కారణమైన సమస్యను గుర్తించి పరిష్కరించిన వెంటనే ఫలితాలు కనిపించవని నిపుణులు స్పష్టం చేశారు. జుట్టు పెరుగుదలలో మార్పులు కనిపించడానికి సాధారణంగా మూడు నుంచి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. రోజుకు సుమారు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సాధారణమేనని పేర్కొన్నారు. ఒత్తిడి, అనారోగ్యం, బరువు తగ్గడం, హార్మోన్ల మార్పులు లేదా ప్రసవానంతర పరిస్థితుల వల్ల జుట్టు రాలుతున్నప్పుడు, కారణాన్ని తెలుసుకోకుండా బయోటిన్, ఇనుము లేదా కొల్లాజెన్ వంటి పోషక పదార్థాల ట్యాబ్లెట్లను వాడడం సరికాదని సూచించారు. పరీక్షల ఫలితాలతోపాటు లక్షణాలు, గత వైద్య చరిత్ర, జుట్టు రాలుతున్న తీరును పరిగణనలోకి తీసుకుని వైద్యుల సలహాతో తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమని వివరించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

