Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నావు అంటున్నారు..!
టాలీవుడ్ సింగర్ సునీత (Sunitha) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కొంతమంది సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల లైఫై స్టోరీస్ స్ఫూర్తిని కలిగిస్తుంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సింగర్ సునీత (Sunitha) విషయంలో స్ఫూర్తిదాయకమైన విషయాలుంటాయని ఆమె గురించి తెలిసిన వారు చెప్తుంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో సునీతను చూసి నేర్చుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతుంటారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సునీత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందరి టీనేజర్ల లాగే నా జీవితం కూడా చాలా అద్బుతంగా ఉండాలనుకునేదాన్ని. నన్ను జాగ్రత్తగా చూసుకునే లైఫ్ పార్ట్నర్ రావాలని కలలు కనేదాన్ని. కానీ కిరన్ కుమార్ గోపరాజును (మొదటి పెళ్లి)పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సవాళ్లను ఎదుర్కొన్నా. అసలు జీవితమంటే ఏంటో తెలుసుకున్నా. మళ్లీ 15 ఏళ్లకు రామ్ (Mango Ram)ను రెండో పెళ్లి చేసుకున్నా. అంతకు ముందు నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పింది.
జనాలు ఇప్పుడు కూడా నేను డబ్బు కోసమే రామ్ ను పెళ్లి చేసుకున్నానని అంటున్నారు. కానీ రామ్ ఎంత సంపాదిస్తున్నాడో, అతడికి ఎన్ని ఆస్థులున్నాయో, రామ్ వ్యాపార లావాదేవీలేంటో నాకిప్పటివరకు తెలియదు. జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత అచేతన స్థితిలోకి వెళ్లి వ్యక్తులను నమ్మడం మానేశాను. కానీ రామ్ విషయంలో నేను ఎందుకు ప్రేమించానంటే..రామ్ నాకు ప్రపోజ్ చేసినపుడు..నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకుంటే నేను సంతోషంగా ఫీలవుతా. అంతేకాదు నువ్వు తిరస్కరించినా నేను ఖచ్చితంగా బాధపడను. కానీ నా జీవితాన్ని ఇక్కడే ఆపను. ముందుకు నడిపిస్తానని రామ్ నాతో చెప్పాడు. రామ్ లో ఉన్న నిజాయితీ నాకు నచ్చింది. రామ్ కు , తనకు ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చింది సునీత.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

