ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR). టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణ సంబంధిత అంశాల్లో జాప్యం నెలకొన్న నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనతో ప్రేక్షక లోకం చాలా నిరాశ చెందింది. అయితే ఆర్ఆర్ఆర్ ఆలస్యమవుతున్న లోటును భర్తీ చేసేందుకు రాజమౌళి టీం పలు ప్లాన్స్ సిద్దం చేసింది. అందులో ఒకటే (RRR Merchandise) వస్తువుల అమ్మకం. టీ షర్టులు, కాఫీ మగ్స్, పోస్టర్లు, బ్యాడ్జిలు, ఫేస్ మాస్కులు ఈ కలెక్షన్లలో అందుబాటులో ఉన్నాయి. టాలీవుడ్ (Tollywood) నటుడు రానా ( Rana Daggubati ) వీటిని లాంఛ్ చేశాడు.
నాలుగు భిన్నమైన డిజైన్లలో రూపొందించిన టీ షర్టులు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.599గా నిర్ణయించారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా గర్జిస్తున్న స్టిల్‌తోపాటు కొమ్రం భీం పాత్రలో ఎన్టీఆర్ బుల్లెట్ రైడ్ చేస్తున్న స్టిల్స్ ముద్రించబడ్డ టీ షర్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక కాఫీ మగ్స్ ధర రూ.399 నుంచి ప్రారంభం కాగా..ఫేస్ మాస్క్ రూ.149 (సింగిల్ పీస్)గా నిర్ణయించారు. నోట్‌బుక్స్ తోపాటు ఇతర కలెక్షన్లు కూడా ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్ టీంనుంచి విడుదలైన మొదటి కలెక్షన్స్ కు మంచి అమ్మకాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ‘RRR’ సరుకులను దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పాప్ కల్చర్ స్టోర్ ఫిల్మీ (Filmy) రూపొందించింది. మొత్తానికి జక్కన్న ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ వైపు ప్రమోషన్స్ చేస్తూనే..మరోవైపు అభిమానుల్లో జోష్ నింపేందుకు చేస్తున్న ఈ ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Proud to launch the Official Merchandise of #RRR, the labour of love of my alumnus dir @ssrajamouli on a brand I really love, @fullyfilmy_offl ♥️♥️
— Rana Daggubati (@RanaDaggubati) September 21, 2021
Fans of @AlwaysRamCharan , @tarak9999 & Cinema, start the celebrations: https://t.co/F6mnb6KF3V#RRRonFF#RRRonFullyFilmy pic.twitter.com/VSdOyRKdqP
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!