పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మెరిసి..సౌత్‌తోపాటు నార్త్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ భామ ప్రస్తుతం తెలుగు, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న యానిమల్(Animal)లో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.
ఈ మూవీ షూటింగ్ కోసం ఢిల్లీ (Delhi)ని సందర్శించిందట రష్మిక. ఈ భామ మొదటిసారి షూటింగ్ కోసం ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతుండటం పట్ట చాలా ఎక్జయిటింగ్ ఉందట. యానిమల్ షూటింగ్ ఇతర కమిట్ మెంట్స్ కోసం రష్మిక ఢిల్లీ వెళ్తుండటం మొదటి సారి. షూటింగ్ కోసం ఢిల్లీ వెళ్లి..నగరాన్ని చుట్టివచ్చేందుకు, అభిమానులతో చిట్ చాట్ చేసేందుకు ఎక్జయిటింగ్‌గా ఉంది.
బిజీగా షెడ్యూల్ వల్ల ఎప్పుడూ ఢిల్లీని సందర్శించలేదు. కానీ ఈ సారి క్యాపిటల్ సిటీకి వెళ్లే అవకాశం రావడంతో చాలా ఎక్జయిట్ అవుతుందని..రష్మిక సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తాజా అప్ డేట్ ప్రకారం రష్మిక జులై 26న ఢిల్లీకి పయనమై..కొన్ని రోజులు అక్కడే స్టే చేయనుందట. రష్మిక నటిస్తున్న బాలీవుడ్ మూవీ గుడ్ బై షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు పుష్ప 2, మిషన్ మజ్ను, వారిసు చిత్రాలతో బిజీగా ఉంది.